ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం (డిసెంబర్ 26) తిరుపతిలో పర్యటించారు. తిరుపతిలో భారతీయ వైజ్ణానిక సమ్మేళన్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిం చారు.

ఆ తరువాత ఆయన ఎన్టీఆర్ రాజు కుటుంబాన్ని పరామర్శించారు. ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం సీనియర్ నేత ఎన్టీఆర్ రాజు ఇటీవల తిరుపతిలో మరణించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రాజు కుమారుడు, తెలుగుదేశం మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ నివాసానికి వెళ్లిన చంద్రబాబు,  వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఎన్టీఆర్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎన్టీఆర్ రాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాలులర్పించారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu