ఐటీ కంపెనీ ఉద్యోగులకు పెరిగిన వేతనాలు

ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని వంటి సంస్థల్లో దాదాపు 70 శాతం మంది ఉద్యోగులకు వేతనాలు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను వీరికి సింగిల్ డిజిట్ వేతనం పెరిగింది. ఈ సంస్థలోని 84,000 ఉద్యోగులకు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ వేతన పెంపు అమలవుతుంది. మిగతా వారికి అప్రైజల్స్ జూలై నెలలో ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అంతే కాదు క్యాప్‌జెమిని నాలుగువేల జాబ్ ఆఫర్లు కూడా ఇచ్చింది. ఇందులో 2,000 మంది ఫ్రెషర్స్ ఉన్నారు. కేవలం క్యాప్‌జెమినియే కాదు వివిధ సేవా సంస్థలు కూడా ఇదే దారిలో నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగాలు ఉండటం కష్టంగా ఉందనే సమయంలో కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులకు ఊహించని విధంగా వేతన పెంపు, కొత్త ఆఫర్లు ఇవ్వడం గమనార్హం. తమ ఉద్యోగులందరినీ నిలుపుకుంటామని క్యాప్ జెమిని చెబుతోంది. బిల్లబుల్ ప్రాజెక్టుపై లేకుండా బెంచ్‌కు పరిమితమైన వారిని కూడా నిలుపుకుంటామని చెబుతోంది. సాధారణంగా ఉద్యోగులను 60 రోజుల పాటు బెంచ్‌కు పరిమితం చేస్తారు. మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 8 శాతం మంది బెంచ్‌కు పరిమితమవుతారు.

డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ భారత్‌పే కూడా తమ ఉద్యోగులకు 20 శాతం హైక్ ఇచ్చింది. కాగ్నిజెంట్ ఏప్రిల్ నెలకు గాను బేసిక్ శాలరీలో 25 శాతం అదనపు మొత్తాన్ని ఇస్తోంది. మరోవైపు అసోసియేట్ స్థాయి ఉధ్యోగుల వరకు వేతనం పెంచింది. ఇండియాలో ఈ అమెరికన్ ఐటీ దిగ్గజానికి 2,00,000 మంది ఉద్యోగులు ఉన్నారు. దీనిని అమలు చేయడం ద్వారా దాదాపు మూడొంతుల మంది ఉద్యోగులకు వేతనం పెరిగినట్లు.

ఫ్రాన్స్‌కు చెందిన ఈ ఐటీ మల్టీ నేషనల్ కంపెనీ తమ ఉద్యోగులకు కొందరికి రూ.10,000 అలవెన్స్ కూడా ఇస్తోందట. రీలోకేషన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, అకామిడేషన్ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి ఈ మొత్తం అందిస్తోంది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చింది.