పూర్తిగా అంతం చేయలేం.. వ్యాక్సిన్ వేసుకున్నా మూడు నెలలే...

2020 ని స్తంభింపచేసిన కరోనా వైరస్ ను అరికట్టడానికి మరికొద్దిరోజుల్లో వ్యాక్సిన్ వస్తుంది అంటూ మాస్క్ కట్టుకుని మరీ ఎదురుచూస్తున్నాం. ఎప్పుడెపుటడు వ్యాక్సిన్ వస్తుందా.. స్వేచ్ఛగా బయట తిరుగుతామా అమి ఎదురుచూస్తన్న వారికి ప్రపంచ ఆరోగ్యసంస్థ తాజాగా చేసిన వ్యాఖ్య మింగుడు పడటం లేదు. ప్రస్తుతం పరిస్థితుల్లో ఈ వైరస్ ను పూర్తిగా అంతం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రోగ్రాం చీఫ్ డాక్టర్ మైక్ ర్యాన్ ప్రకటించారు. వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తూ వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలం అవుతున్న ప్రభుత్వాలు, దేశాలు ఈ ప్రకటనను గమనించాల్సిందే. ఎక్కువ మందికి వైద్య పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో వ్యాప్తిని అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే కరోనా వ్యాప్తిని చాలావారకు నియంత్రించవచ్చు.

వ్యాక్సిన్ వేసుకున్నా మూడునెలలే...
కోవిద్ 19 వైరస్ వ్యాక్సిన్ అతిత్వరలో అందుబాటులోకి వస్తుందన్న ఆశాభావం చాలామందిలో కనిపిస్తుంది. వ్యాక్సిన్ తీసుకుంటే చాలు కరోనా తమను ఎం చేయలేదు అన్న భద్రత ఉంటుంది అనుకుంటే అది పొరబాటే అంటున్నారు లండన్ పరిశోధకులు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మూడునెలలు మాత్రమే వైరస్ ను ఎదుర్కోనే శక్తి ఉంటది అంటున్నారు ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎస్‌‌‌‌, కింగ్స్ కాలేజ్ లండన్ శాస్త్రవేత్తలు.అంతేకాదు ఒక డోస్‌‌‌‌ వేసుకుంటే సరిపోదని, ప్రతి ఏడాది వేసుకోవాల్సిందే అంటున్నారు. అయితే ఎక్కువగా తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కారణం ఈ వైరస్ ను పూర్తిగా అంతం చేయలేం. జబులు, దగ్గు మాదిరిగానే ప్రతి ఏడాది రావచ్చు. అయితే వ్యాక్సిన్ ల కోసం ఎదురుచూడటం కన్నా వ్యాప్తిని నియంత్రించడమే చాలా మంచిది.