భవనం కూలి 17 మంది మృతి

 

ఈజిప్టు దేశ రాజధాని నగరం కైరోలో ఒక భవనం కూలి 17 మంది మరణించారు. ఈ ఘటనలో మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గతంలో నిర్మితమై ఉన్న మతారియా సుబుర్బ్ భవనానికి అదనంగా మరికొన్ని అంతస్తులను వేశారు. బరువు పెరిగిపోవడంతో ఈ భవనం కూలిపోయింది. రక్షణ దళాలు భవనం శిథిలాలను తొలగించే పనిలో ఉన్నాయి. ఈ విషయాన్ని కైరో పౌర రక్షణ విభాగం జనరల్ డైరెక్టర్ మామ్ దో అబ్దుల్ ఖాదిర్ తెలిపారు. ఈ పురాతన భవనం శిథిలావస్థకు చేరింది. పైగా దాని మీద మరికొన్ని అంతస్థులు కట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ భవనంలో నివాసం ఉన్న వారిని ఖాళీ చేయాలంటూ గతంలోనే అధికారులు ఆదేశించారు. అయినా వారు వినలేదు. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో వారిలో చాలామంది మరణించారు.