కొడాలి నానికి బైపాస్ సర్జరీ
posted on Apr 2, 2025 2:06PM

ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్ లో ఏపీ మాజీ మంత్రి కొడాల నానికి బైపాస్ సర్జరీ జరుగుతోంది. ఈ శస్త్ర చికిత్స పూర్తి కావడానికి దాదాపు ఎనిమిది గంటల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని ఇటీవల తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. అక్కడ వైద్య పరీక్షలలో ఆయనకు గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు తేలింది.
ఆయన హార్ట్ లో మూడు వాల్వ్ లు పూర్తిగా మూసుకుపోయాయని తేలడంతో తొలుత స్టంట్ లు వేయాలని వైద్యులు భావించారు. అయితే మూడు వాల్వులు పూర్తిగా మూసుకుపోయి ఉండటంతో పాటు కిడ్నీ సమస్య కూడా ఉండటంతో నాని కుటుంబ సభ్యులు ఆయనను మరింత మెరుగైన చికిత్స కోసం ముంబైలోని ఏషియన్ కార్డియాక్ సెంటర్ తకు తరలించాలని నిర్ణయించుకున్నారు.
దీంతో నాని ఏఐజీ ఆస్పత్రి నుంచి ఇలా డిశ్చార్జ్ చేసి అలా ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు. అక్కడ ప్రముఖ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు బుధవారం (ఏప్రిల్ 2) బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించింది.