నాగర్ కర్నూల్ ఘటనలో కొత్త కోణం
posted on Apr 2, 2025 3:07PM
తెలంగాణ లో సంచలనమైన నాగర్ కర్నూల్ జిల్లాలో ఊర్కొండ రేప్ ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. మొక్కులు తీర్చుకునేందుకు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చిన వారు భార్యభర్తలు కాదని పోలీసుల దర్యాప్తులోవెల్లడైంది. గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్న జంట భార్యా భర్తలు కాదని తెలుసుకున్న నిందితులు యువతిని బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మైనర్లు, ప్రేమికులను బెదిరించి లైంగిక దాడులకు పాల్పడేవారని వెల్లడైంది.
మొక్కులు తీర్చుకునేందుకు ఈ జంట ఆలయానికి చేరుకుని రాత్రి అక్కడే ఉండిపోయారు. కాలకృత్యాల కోసం యువతి గుట్టలవైపు వెళ్లగానే అప్పటికే మాటు వేసిన ఏడుగురు నిందితులు ఒకరి తర్వాత ఒకరు రాత్రంతా రేప్ చేశారు. యువతి గట్టిగా కేకలు వేయగానే వెంట వచ్చిన యువకుడిని చితకబాదారు. ఆలయంకు వచ్చే భక్తులతో బాటు ప్రేమికులను నిందితులు గతంలో లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆలయ ఉద్యోగి ఇచ్చిన సమాచారం మేరకు నిందితులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇప్పటికే ఈ రేప్ ఘటనలో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. అత్యాచారాలను అరికట్టడానికి పాలకులు దిశ, నిర్భయ చట్టాలను తీసుకువచ్చినప్పటికీ రోజురోజుకు ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పలువురిని ఆందోళన కలిగిస్తోంది.