బ్లూమింగ్‌టన్ తెలుగు అసోసియేషన్ సేవానిరతి

 

అమెరికాలోని బ్లూమింగ్‌టన్ తెలుగు అసోసియేషన్ తన సేవా నిరతిని చాటుకుంటోంది. ఇద్దరు చిన్నారుల అరుదైన వ్యాధికి శస్త్రచికిత్స కోసం డిసెంబర్ 20వ తేదీన బ్లూమింగ్‌టన్‌లోని వైడబ్ల్యుసీఎలో ‘బ్రేక్‌ఫాస్ట్ సేల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తమరా సెన్సర్ అనే వ్యక్తి ఇద్దరు కుమారులు మసోన్, ఆస్టిన్‌ అవయవ మార్పిడి చేయాల్సిన వ్యాధిని ఎదుర్కొంటున్నారు. అరుదైన ఈ వ్యాధికి శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం వుంది. దీని కోసం బ్లూమింగ్టన్ తెలుగు అసోసియేషన్ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తోంది. డిసెంబర్ 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘బ్రేక్‌ఫాస్ట్ సేల్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్లూమింగ్టన్ తెలుగు అసోసియేషన్, చిల్డ్రన్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.