చంద్రబాబు తో మీట్ & గ్రీట్ లో సాయి దత్త పీఠం బృందం
posted on Sep 25, 2018 2:26PM
న్యూ జెర్సీ NRI TDP నిర్వహించిన AP CM తో మీట్ & గ్రీట్ సమావేశానికి, ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన స్థానిక సాయి దత్త పీఠం ( షిరిడీ ఇన్ అమెరికా) బృందం, చంద్రబాబు నాయుడు ను దుశ్శాలువాతో సత్కరించి, పూలమాలాలంకృతులను చేసి బాబా చిత్రపటాన్ని అందించారు. ఈ సందర్భంగా, సాయి దత్త పీఠం చైర్మన్ రఘుశర్మ శంకరమంచి మరలా మీరే ముఖ్యమంత్రి గా రావాలని తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలియచేసారు. 25 ఎకరాలలో నిర్మించ తలబెట్టిన షిరిడీ ఇన్ అమెరికా కు బాబు తన అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేసారు.
CM ను కలిసే అవకాశం కల్పించిన నిర్వాహకులకు, ప్రత్యేకంగా మన్నవ మోహనకృష్ణ కు, కలపటపు బుచ్చి రామ్ ప్రసాద్, వెనిగళ్ల వంశీ కృష్ణ లకు రఘుశర్మ మరియు బృందం అభినందనలు తెలియచేసారు.