మహారాష్ట్రలో మహాయతి.. ఝార్ఖండ్ లో జేఎంఎం కూటమి ఆధిక్యం

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ఆరంభమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే తొలి ఆధిక్యతలు ఉన్నాయి.   ఝార్ఖండ్ లో మాత్రం ఝార్ఖండ్ ముక్తి మోర్చా బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది.

తొలి ట్రెండ్స్ లో ఝార్ఖండ్ ముక్తిమోర్చా కూటమి ఆధిక్యత కనబరిచింది ఇక మహారాష్ట్రలో అయితే బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి సంపూర్ణ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. కడపటి వార్తలందేసరికి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయతి కూటమి 219 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యతలో ఉండగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఎంవీఏ కూటమి 59 స్థానాలలో ముందంజలో ఉంది.