తెలంగాణ ఎన్నికలు.. బెట్టింగుల జోరు!
posted on Nov 29, 2023 3:51PM
తెలంగాణ పాలిటిక్స్ పై, క్రికెట్ మ్యాచ్‌కు మించిన ఉత్కంఠ.. కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు మొదలైంది. బిజినెస్ పెంచుకోవడం కోసమే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ను ప్రోత్సహిస్తోంది ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా... బెట్టింగ్ మాఫియా తెలంగాణా ఎన్నికల ఫలితాల్ని సొమ్ము చేసుకోవడంపై దృష్టి పెట్టింది. వెనుకుండి కథ నడుపుతోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇండియాలోని 14 కోట్ల మంది బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలలో రెగ్యులర్ గా భాగం పంచుకుంటున్నారని అంచనా. ఐపీఎల్ సీజన్లో ఈ సంఖ్య 37 కోట్ల దాకా పెరుగుతోందని థింక్ ఛేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) నివేదిక పేర్కొంది. టీసీఎఫ్ నివేదిక ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ను ప్రోత్సహించే 75 వెబ్ సైట్లు పనిచేస్తున్నాయి. ఈ వెబ్ సైట్లన్నీ ఇండియా యూజర్లనే టార్గెట్ చేసుకుంటున్నాయి.
పాపులర్ బాలీవుడ్ యాక్టర్లు, స్పోర్ట్స్ పర్సనాలిటీలను వాడుకుని మరీ దేశంలోని యూజర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలను ఆ ఆపరేటర్లు చేస్తున్నారు. హవాలా, క్రిప్టో కరెన్సీ, ఇతర అక్రమ మార్గాలలో డబ్బు చేతులు మారుతోంది. క్రికెట్ వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రారంభమైన ఇల్లీగల్ బెట్టింగ్ దేశంలో ఊపందుకుందనేది బహిరంగ రహస్యమే. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా రకరకాల మార్గాలలో కోట్లాది రూపాయలతో పందెం రాయుళ్లు బెట్టింగ్ చేస్తున్నారట. ఇండియాలో ఏటా సాగుతున్న ఇల్లీగల్ స్పోర్ట్స్ బెట్టింగ్ కార్యకలాపాల విలువ 8 లక్షల 20 వేల కోట్ల (100 బిలియన్ డాలర్లు) దాకా ఉంటుందని థింక్ ఛేంజ్ ఫోరమ్ (టీసీఎఫ్) ఇటీవల విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
ఇటీవలే క్రికెట్ పండగ అయిపోయింది. ఇల్లీగల్ బెట్టింగ్ ద్వారా 8 లక్షల 20 వేల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నది టీసీఎఫ్ అంచనా. ప్రస్తుతం.... ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా తెలంగాణా ఎన్నికల ఫలితాల్ని సొమ్ము చేసుకోవడంపై దృష్టి పెట్టింది. వెనుకుండి కథ నడుపుతోంది. తెలంగాణ పాలిటిక్స్ పై, క్రికెట్ మ్యాచ్‌కు మించిన ఉత్కంఠ.. కనిపిస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు మొదలైంది. బిజినెస్ పెంచుకోవడం కోసమే రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ ను ప్రోత్సహిస్తోంది ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా.
గెలిచేది ఎవరు.. కేసీఆర్ సీఎం అవుతారా? కాంగ్రెస్ గెలుస్తుందా.. రేవంత్ ముఖ్యమంత్రి అవుతారా అన్న చర్చే ఇప్పుడు ఎక్కడ చూసినా జోరుగా సాగుతోంది. ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరాహోరీ తలపడుతుండటం. గత ఎన్నికలకు భిన్నంగా పొత్తు ఈక్వేషన్స్ ఉండటంతో.. మరింత ఆసక్తి రేపుతోంది. ఈ బెట్టింగ్ గొడవ అంతా తెలంగాణాలో కొనసాగుతున్నదంటే పెద్ద విషయం ఏమీ కాదు కానీ ఈసారి పొలిటికల్ బెట్టింగ్స్.. ఏపీలోనూ జోరుగా సాగటం విశేషం.
గత ఎన్నికల కంటే ఈసారి తెలంగాణ పాలిటిక్స్ పై ఏపీలో బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి,.... టీడీపీ శ్రేణులు మద్దతుగా నిలవడం ఒక కారణమైతే.. రేవంత్ రెడ్డిని టీడీపీ అనుకూల వర్గం ఓన్ చేసుకోవటం మరో కారణం. ఏపీ తెలుగుదేశం అభిమానులు మొత్తం కాంగ్రెస్ వైపు బెట్టింగ్స్ ఎక్కువ కాస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల వేళ ఏపీలోనూ బెట్టింగ్ జోరు మొదలయ్యింది.. బెట్టింగ్ రాయుళ్లు.. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై హోరాహోరీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో అధికారంలోకి ఎవరు వస్తారు..? అనే దానిపై ఏపీ లో కూడా విపరీతంగా బెట్టింగ్స్ పెడుతున్నారు.. పోలింగ్ సమయం సమీపిస్తున్న వేళ బెట్టింగ్ రాయుళ్ల జోష్ పెరుగుతోంది. ఈ బెట్టింగ్ బిజినెస్ సుమారుగా 3 వేల కోట్ల రూపాయల నుండి 5 వేల కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉందని సమాచారం.. బెట్టింగ్‌లలో తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది? నెక్స్ట్ సీఎం ఎవరు..? నియోజకవర్గ స్థాయిలో ఎవరు గెలుస్తారు..? వివిధ రకాలుగా బెట్టింగులు పెడుతున్నారు నిర్వాహకులi.
క్రికెట్ లో బాల్ బాల్ కు బెట్టింగ్ జరిగినట్లు.. తెలంగాణ పొలిటికల్ ఫీవర్.... ఇప్పుడు బెట్టింగ్స్ లోనూ మంట పుట్టిస్తున్నది. ఎన్నికల ఫలితాలపై పందేలు కొనసాగుతున్నాయి.. విచ్చలవిడిగా కోట్ల రూపాయలు ఇప్పటికే చేతులు మారుతున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఎక్కువ ఓట్లు ఉన్న శేరిలింగంపల్లి నియోజకవర్గం పై కూడా బెట్టింగ్ రాయుళ్లు పందాలు పెడుతున్నారు…అరికపూడి గాంధీ గెలుస్తారా? ఒడిపోతారా?.. అని ఎక్కువ స్థాయి లో డబ్బులు పెడుతున్నట్టుగా సమాచారం.. ఇక అనుకూలంగా ఉన్న వ్యక్తులు గెలుస్తారంటూ ఎవరికివారు పందాలకు దిగుతున్నారు. ఈ విధంగా నాయకుల పై కాసుల వర్షం కురిపిస్తున్నారు… మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ లో కీలకంగా ఉన్న నియోజకవర్గాలు శేరిలింగంపల్లి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్ నియోజకవర్గాలపై ఎక్కువ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు.
ఇక జిల్లాల వారిగా కొడంగల్, దుబ్బాక, కామారెడ్డి…ప్రాంతాలపై మరింత బెట్టింగ్ పెట్టేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పందెం రాయుళ్లు. దీంతో తెలంగాణ పోలింగ్ సమయం దగ్గర పడడంతో కేవలం తెలంగాణా రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనూ బెట్టింగుల జోరు ఊపందుకుంటోంది. బెట్టింగ్ వ్యాపారం బుకింగ్ జోరుగానే సాగుతోంది. మొత్తం స్టేట్ లెవెల్‌లో చూస్తే కాంగ్రెస్ వైపు రూపాయి పెడితే, రూపాయి 40 పైసలు నడుస్తోంది. బీఆర్ఎస్ వైపు మాత్రం రూపాయికి, కేవలం 60 పైసలు నడుస్తోంది.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీల మధ్య బెట్టింగ్ హోరాహోరీగా సాగుతుంది.
ప్రత్యేకించి ఒక్కో నియోజకవర్గం గురించి అయితే ..... ఒకటికి ఒకటి అన్నట్లు బెట్ కాస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది ఇంట్రస్టింగ్ పాయింట్ అయ్యింది. బీజేపీ గెలిచే సీట్ల సంఖ్యపైనా బెట్టింగ్స్ జరగటం ఆసక్తి రేపుతోంది. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి బరిలోకి దిగారు.. ఒకటి గజ్వేల్, ఒకటి కామారెడ్డి.. కేసీఆర్ రెండు చోట్ల గెలుస్తారా లేక ఒక చోట గెలుస్తారా?. ఒకే స్థానంలో విజయం సాధిస్తే అది గజ్వేలా? కామారెడ్డా? ఓడిపోయే సీటు ఏది? అన్న అంశంపైనా బెట్టింగ్స్ జరుగుతున్నాయి.
హైదరాబాద్ తోపాటు ఏపీలోని ఈస్ట్, వెస్ట్, గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్స్ బాగా జరుగుతున్నాయి. పోలింగ్ ముగిసే వరకు మాత్రమే ప్రస్తుతం ఈ రేటుపై బెట్టింగ్స్ జరుగుతుందట. పోలింగ్ ముగిసి ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తరువాత ఇంకెంత బెట్టింగ్ జరుగుతుందో చూడాలి. ఎ
నవంబర్ 30 న ఎన్నికలు జరుగుతుండటం, డిసెంబర్ 3 న అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఉండటం తో బెట్టింగ్ రాయుళ్లు తీరిక లేకుండా గడుపుతున్నారు.