చద్దన్నంలో దాగున్న అద్భుత రహస్యాలు..!!
posted on May 3, 2022 9:30AM
చద్ది అన్నం ఇప్పటికీ మన గ్రామీణ ప్రాంతలాలో సంప్రదాయ బద్దం గా అనుసరిస్తున్నపాత పద్ధతి.
చద్ది అన్నం అంటేనే నేటితరం ఇది కేవలం పల్లెటూరి వారు మాత్రమే తినే ఆహారం అంటూ చులకనగా చూడడం మనం గమనించవచ్చు.
చద్ది అన్నం అంటే...
చద్ది అన్నం అంటే రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని చద్ది అన్నంఅని అంటారు. ఇక్కడ ఒక సామెత గుర్తుకు వస్తోంది పెద్దల మాట చద్దనం మూట.అంటే పెద్ద వాళ్ళు ఏ దిచెప్పిన అమృతం లా ఉంటుందని అంటారు. చద్ది అన్నం ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో ఉదయం పూట తీసుకోవడం ఆచారంగా సాగుతుందికాని మరో సామెత ఏమిటి అంటే చద్దన్నం తిన్న ఆమెకి మొగుడు ఆకలి ఏమితేలుసు అని అనే వారు అంటే చద్దన్నం తిన్న మహిళలు అంతలా సుఖం గా నిద్రపోతారని దాని అర్ధం అంటే మొగుడి ఆకలిని కూడా మర్చిపోయే విధంగా చేసే కేవలం మాత్రమే కాదు అందులో ఆహార రహాస్యం ఉందని అంటారు సాంప్రదాయ వైద్యనిపుణులు డాక్టర్ కృష్ణం రాజు. ఆవిషయం ఎదో అయన మాటల్లో చూద్దాం.
చద్దనం లో అమోఘమైన ఆరోగ్య రహస్యం...
చద్ది అన్నం లో ఉన్న ఆరోగ్య రహాస్యం ప్రయోజనాలు మీకు తెలిస్తే మీరు కూడా ఇకపై మిగిలిన అన్నాన్ని చెత్తబుట్టలో వేయరని అనుకుంటున్నా.చద్ది అన్నం తినాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపు తో చద్ది అన్నాన్ని బ్రేక్ ఫాస్ట్ గా తీస్సుకోవడం వల్ల శరీరం లైట్ గా శక్తివంతంగా ఉంటుంది. అద్భుత ఫలితాలు పొందవచ్చు అంటున్నారు సాంప్రదాయ వైద్య నిపుణులుడాక్టర్ కృష్ణం రాజు. చద్ది అన్నం ఎలా ఒండుతారు సహజంగా మనం సాంప్రదాయ పద్దతిలో అంటే కుక్కర్లో కాకుండా గిన్నెలో అన్నం గంజి వార్చకుండా వండిన అన్నం రెడీ అయిన తరువాత కాస్త చల్లార నిచ్చి ఆ అన్నాని మట్టి పాత్రలో నీళ్ళు పోసి నాన పెట్టాలి రాత్రి అంతా అలాగే ఉంచి ఉదయం పెరుగు,ఉప్పు, పచ్చి ఉల్లిపాయ లేదా పచ్చి మిర్చి కలిపి తీసుకోవాలి. దీనిరుచి మాటల్లో చెపితే సరిపోదు.దీనిలో అద్భుత ఆరోగ్య రహస్యాలు ఉన్నాయన్న విషయం తెలుసుకుందాం. ఇంకో పద్దతిలో రాత్రి సమాన మైన వేడిలో అది మట్టి కుండలో అయితే వండిన అన్నం అయితే మరీ మంచిది.అన్నం లో పాలు పోసి కొంచం తోడు వేస్తే అది ఉదయానికి గట్టిగా తోడు కుంటుంది.అప్పుడు అందులో ఒక నిమ్మకాయ,ఆవకాయ పచ్చడి కలిపి తింటే ఆ రుచి వేరనే చెప్పాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ని ఉన్నత కుటుంబాలలో సైత్ఘం కొన్ని సంవత్సరాల క్రితం వరకూ కూడా తరువాని అన్నం అనే భోజనాన్ని వేసవి కాలం లో తీసుకునే వారని మన పూర్వీకులు చెప్పుకునే వారు. ఎలాంటి సాంప్రదాయ ఆహారం అయినా మనకు శక్తిని బలాన్ని ఇస్తుంది అనడం లో సందేహం లేదు శరీర సౌష్టవం ఆరోగ్యం ఇచ్చే చద్ది అన్నం లో ఉన్న పోషకాలు ఏమిటో చూద్దాం.
మీరు నాజూకుగా అందంగా ఉండాలంటే చద్ది అన్నం తీసుకోండి...
ఇది నిజం రాత్రి అంతా ఫెర్మినేట్ చేసిన రైస్ లో త్గాజా గా వండిన అన్నం తో పోలిస్తే 6౦% తక్కువ క్యాలరీలు ఉంటాయి. అందుకే రైస్ తినడం వల్ల స్లిమ్ గా ఉండడానికి సహాయ పడుతుంది.
మినరల్స్..
చద్ది అన్నం లో ఉండే లాక్టిక్ యాసిడ్ ఐరన్,పొటాషియం క్యాల్షియం గా మారుతుంది అది వేల సంఖ్యలో పెరగడం క్యాల్షియం మాత్రలు వాడనవసరం లేదని రాదని అంటున్నారు ప్రముఖ సాంప్రదాయ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు అంటున్నారు. సాధారణం గా అన్నంలో ౩.4% ఎం జి ఐరన్ఉంటె ఇలా 12 గం ఫెర్మేషణ్ చేసిన 1౦౦ అన్నం లో ఐరన్ 7౩.91% ఐరన్ఉంటుంది. ముందు రోజు వండిన అన్నం ఉదయం తీసుకోవడం వల్ల అన్నం లో ఆహారం ద్వారా లభించే విటమిన్ బి6 బి 12 లభిస్తుందని దీనికోసం టాబ్లెట్లు వాడకుండానే సహజంగా మన ఆహారం ద్వారా లభిస్తుందని అంటున్నారు సహజ పద్దతిని వడిలో కృత్రిమ పద్దతిలో పనులు చేయడం వల్ల అనారోగ్యం పాలు అవుతున్నమన్న సంగతి గ్రహించాలి.
మంచి బ్యాక్టీరియా...
అన్నంలో అత్యంత ఎక్కువ ప్రయోజన కరమైన బ్యాక్టీరియా లభిస్తుందని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు గారు. బ్యాక్టీరియా జీర్ణ ప్రక్రియకు సహాయ పడుతుంది అలాగే అనేక వ్యాధులతో పో రాడడానికి ఇమ్యునిటిని మెరుగు పరుస్తుంది.ఇలా మిగిలిపోయిన చద్ది అన్నం తినడం వల్ల ఎముకలకు సంబందించిన అనారోగ్య సమస్యలు రావు అని అంటున్నారు రాజు గారు.కండరాల నొప్పులు దూరంగా ఉంటాయి. చద్ది అన్నం తీసుకోవడం వల్ల అన్నంలో లభించే పోషకాలు చర్మ సమస్యలు,ఎలర్జీలు ,ఎగ్జిమా,దురద వంటి వాట్ని దూరంగా ఉంచుతుంది.
అల్సర్స్ నివారిస్తుంది...
పొట్టలో అక్సర్స్ మాత్రమే కాదు ఇతర అన్ని రకాల అల్సర్స్ కు దూరంగా ఉండాలంటే చద్ది అన్నం ప్రతిరోజూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు.
యవ్వనం గా ఉండాలంటే...
మీరు ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా సౌందర్యంగా ఉండాలంటే చద్ది అన్నం తీసుకోండి నిత్య యవ్వనం తో మెరిసిపొండి.
పొట్ట సమస్యలు..
ఉదయం వేళ లో మీరు చద్ది అన్నం తీసుకోవడం వల్ల పొట్టకు సంబందించిన సమస్యలు దూరమౌతాయి.శరీరానికి హానిచేసే బాడీ హీట్ తగ్గిస్తుంది.
కన్సిపెషణ్...
చద్ది అన్నం లో పీచుపదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల దీనిని ప్రతిరోజూ తీసుకుంటే కాన్సిపెషణ్ సమస్య దూరం అవుతుంది.
బ్లడ్ ప్రెజర్...
చద్ది అన్నం తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ టే న్క్షన్ కూడా తగ్గుతుందని నిపుణులు పేర్కొన్నారు.
రోజంతా ఉల్లాసం...
చద్ది అన్నం ఉదయాన్నే తీసుకోవడం వల్ల అలసట సమస్య దరి చేరదు.ఆహారం మిమ్మల్ని రోజంతా ఫ్రెష్ గా ఉల్లాసం గా ఉత్సాహంగా ఉంచుతుంది.
ఇంకో ముఖ్యమైన విషయం మనపూర్వీకులు చద్ది అన్నం తిని వందేళ్ళు ఆరోగ్యంగా అనారోగ్యం అన్నది లేకుండా బతికారు.చద్ది అన్నంలో ఉన్న పోషకాలు మన శరీరాన్ని గట్టిగా ఉంచుతాయి అఆహారం లో ఉన్న ఖమ్మదనం ఇప్పటి బ్రేక్ ఫాస్ట్ లో ఉండదన్న విషయం గ్రహించండి.