బెల్లంకొండ కారు బీభత్సం

 

ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారు ఓ యువడికి ఢీకొట్టింది. ఫిలింనగర్ రోడ్ నెంబరు 7లో అదుపు తప్పిన బెల్లంకొండ సురేష్ కారు జనం మీదకు దూసుకెళ్లగా ఈ ప్రమాదంలో ఒక యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. యువకుడు ఫిలింనగర్ బస్తీకి చెందినవాడిగా గుర్తించారు. ఈ ఘటన పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి బెల్లంకొండ సురేష్ కార్యలయంపై దాడి చేశారు. కార్యాలయానికి ఉన్న అద్దాలను పగలగొట్టారు. బెల్లంకొండం సురేష్ కారు నడుపుతున్న డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నట్టు సమాచారం.