టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం
posted on Apr 24, 2015 5:37PM

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షుడిగా ఎనిమిదోసారి ఎన్నికైన అనంతరం ఎల్బీ స్టేడియానికి చేరుకున్న కేసీఆర్ జ్యోతి ప్రజ్వనల చేసి పార్టీ ప్లీనరీని ప్రారంభించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు కేకే, కేటీఆర్, ఈటెల రాజేందర్, హరీష్‌రావుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు ఈ ప్లీనరీలో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ సాధించడానికి టీఆర్ఎస్ చేసిన కృషిని వివరించి, తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.