భగ్గుమన్న బస్సు... ముగ్గురి మృతి

 

మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు దగ్ధమైన దుర్ఘటనను మనం ఇంకా మరచిపోకముందే బెంగళూరులో అలాంటి దుర్ఘటనే జరిగింది. బెంగళూరులో ఒక ప్రైవేటు బస్సు దగ్ధమైన దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదానికి కారణం డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. బెంగుళూరులోని ఆర్.కె.పురం దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్‌కి చెందిన బస్సు వేగంగా డివైడర్ని ఢీకొంది. వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. 40 మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు. ముగ్గురు కాలిన గాయాలతో మరణించారు. మరో పదిమంది కాలిన గాయాలకు గురయ్యారు.