టీఆర్ఎస్ 6 నెలల పాలన తుస్సు..
posted on Dec 2, 2014 4:25PM
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది. ఈ సందర్భంగా భారతీయ జనతాపార్టీ నాయకులు టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మీద విమర్శలు గుప్పించారు. బీజేపీ నాయకుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వ పాలన గుర్రం ముందుకు బండి వెనక్కు అన్నట్టు వుందని విమర్శించారు. టీఆర్ఎస్ ఆరు నెలల పాలన దారుణంగా వుందని ఆయన అన్నారు. అలాగే మరో బీజేపీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘సమగ్ర సర్వేతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం సాధించింది? ప్రభుత్వం చెబుతున్నట్టు సర్వే విజయవంతం అయితే పెన్షన్లు ఇవ్వడానికి ఎందుకు జాప్యం జరుగుతోంది? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి కూడా ఎందుకు సమీక్ష జరపలేకపోయారు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానీ, మంత్రులు గానీ రైతుల పొలాల్లోకి ఎందుకు అడుగుపెట్టలేదు? వారిని ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు?’’ అన్నారు.