టీసీని రైల్లోంచి తోసేశారు
posted on Jul 18, 2014 2:14PM

హైదరాబాద్ నగరంలోని హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో దారుణం జరిగింది. టిక్కెట్ చూపించమని అడిగిన పాపానికి టికెట్ కలెక్టర్ గీతను కొందరు దుండగులు రైలులో నుండి తోసివేశారు. గీతకు తీవ్రగాయాలు అవడంతో ఆమెను వెంటనే సికింద్రాబాద్ మెట్టుగూడ రైల్వే ఆస్పత్రికి తరలించారు. టికెట్ అడిగినందుకు దుండగులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం 9గంటల ప్రాంతంలో రైలు లింగంపల్లి స్టేషన్ నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో రైలు బయలుదేరే సమయంలో కొందరు వ్యక్తులను టికెట్ అడగగా వారు ఆమెపై దాడి చేసి రైలు నుంచి కిందకు తోసేశారు. ఈ ప్రమాదంలో గీతకు తీవ్ర గాయలయ్యాయి. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.