చేతులెత్తేసిన కేంద్రం

 

ఏపీ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య ఉద్యోగుల బదిలీపై వాదనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 1200 మంది ఏపీ ఉద్యోగులను బదిలీ కింద రిలీవ్ చేసింది. దానికి సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు నడుస్తుంది. మళ్లీ ఇప్పుడు ఆరుగురిని బదిలీ చేసింది. దీంతో ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంపై మండిపడుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొని వ్యవహరిస్తుందని నిప్పులు చెరుగుతున్నారు.

 

ఇదిలా ఉండగా ఈ వ్యవహారంపై ఈరోజు కేంద్ర హోంశాఖ కార్యదర్శితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎస్‌లు సమావేశమయ్యారు. ఇద్దరు సీఎస్‌లు హోంశాఖ కార్యదర్శికి తమ సమస్యలను విన్నవించారు. అయితే ఈ విషయంపై కేంద్ర హోంశాఖ కూడా చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఈ ఉద్యోగుల బదిలీ వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉన్నందున కోర్టులోనే తేల్చుకోవాలని.. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హోంశాఖ కార్యదర్శి ఇద్దరు సీఎస్ లకు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిసింది.

 

టీ విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

మరోవైపు రిలీవ్ చేసిన ఏపీ ఉద్యోగులను తెలంగాణలోకి రానివ్వద్దని.. వారి స్థానికత ఆధారంగా ఏపీలోనే ఉంచాలని తెలంగాణ ఉద్యోగులు కేపీటీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఒకవేళ వారు తెలంగాణకు వస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu