శ్రీలంక‌లా ఏపీ.. 'ది ప్రింట్' సంచ‌ల‌న న్యూస్‌.. జ‌గ‌న్ ఆర్థిక ఉగ్ర‌వాదం!

కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా సజావుగా సాగడానికి కుటుంబ పెద్ద తన ఆదాయానికి అనుగుణంగా ప్రణాళికా బద్ధంగా వ్యయం చేస్తాడు. కుటుంబ సంక్షేమంతో పాటు ఒక స్థాయి పెరిగేందుకు అవసరమైన విధంగా పొదుపుగా సొమ్మును వినియోగిస్తాడు. అందుకు భిన్నంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా వచ్చినది వచ్చినట్లు  తాత్కాలిక ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఒక ప్రభుత్వాధినేత కూడా ఇదే సూత్రాన్ని అనుసరించి తాను పాలిస్తున్న రాష్ట్రం లేదా దేశాన్ని ప్రజా సంక్షేమాన్ని విస్మరంచకుండ ప్రగతి బాట విడవ కుండా ఆదాయ వనరులను ప్రణాళికా బద్ధంగా వ్యయం చేయాలి. 

అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఏం జరుగుతుందన్నదానికి  ప్రస్తుత శ్రీలంక పరిస్థితి అద్దం పడుతుంది.  అయితే ఆర్థిక క్రమ శిక్షణ పాటించకుండా అతి వేగంగా సంక్షోభంలోనికి కూరుకు పోతున్న రాష్ట్రాలు మన దేశంలో కూడా ఉన్నాయి. అలాంటి రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ టాప్ ఫైవ్ లో ఉందని ‘ది ప్రింట్’ వెబ్ సైట్ కథనం పేర్కొంది. ఉచిత పందేరాలు, ఆదాయ వనరులు, రాబడి మార్గాలను విస్మరించడం వంట చర్యలతో ఏపీ అతి వేగంగా ఆర్థిక సంక్షోభంలోనికి కూరుకు పోతున్నదనీ, ఉద్యోగులకు సమయనికి జీతాలు అందించలేక ఇప్పటికే సతమతమౌతూ,  అన్నిటిపైనా కోతల వాతలు వేస్తూ సంక్షేమం పేరిట ఉచితల పందేరంపైనే దృష్టి పెడుతున్న ఫలితమే ఇదని ఆ వెబ్ సైట్ పేర్కొంది.  
ఒక రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో బేరీజు వేయడానికి ఏటా రాబడుల్లో పెరుగుదలను పరిశీలిస్తే సరిపోతుంది. ఆ కోవన ఏపీ పరిస్థితిని తీసుకుంటే గత మూడేళ్లలో రాష్ట్ర రాబడిలో పెరుగుదల కంటే తీసుకున్న అప్పులకు వడ్డీ చెల్లింపులలో పెరుగుదలే అధికంగా ఉంది. దీనిని బట్టే అర్థమౌతుంది ఏపీ అక్షర క్రమంలోనే కాదు ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యంలో కూడా  అగ్ర స్థానంలోనే ఉందని. ఏపీ ఆర్థిక క్రమశిక్షణను  ఉల్లంఘనల స్థాయి అతి తీవ్రంగా ఉందని కాగ్ నివేదిక కూడా స్ఫష్టం చేసీన విషయం విదితమే.  
ఒక విధంగా చెప్పాలంటే జగన్ సర్కార్ తీరు ఆర్థిక ఉగ్రవాదాన్ని స్ఫురింప చేస్తున్నది.    విపత్తు నిర్వహణ నిధులు, పంచాయతీ నిధులు, ఇలా ఎక్కడ నిధులు ఉంటే అక్కడ నుంచి వాటిని సంక్షేమం పేరట ప్రవేశ పెట్టిన ఉచితాలకు మళ్లించేశారు. అంతే కాకుండా రుణాలను తిరిగి చెల్లించేందుకు ప్రణాళికలే లేకుండా అందిన కాడికి అప్పులు తీసుకు వచ్చేస్తున్న ఏపీలో శ్రీలంక వంటి పరిస్థితిలు ఏర్పడటానికి ఎంతో కాలం పట్టదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. జగన్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని అరికట్టేందుకు కేంద్రం కఠిన ఆర్థిక ఆంక్షలు విధించాలి, లేదా రాష్ట్రంలో ఎకనామిక్ ఎమర్జెన్సీ ప్రకటించాలని సూచిస్తున్నారు.