ఏపీలో ఎన్ని కొత్త కేసులో తెలుసా ? 

కరోనా కేసుల్లో తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఇటు తెలంగాణాలో అటు ఏపీలో శ్రీహరి కోట రాకెట్ లా దూసుకుపోతుంది  కరోనా. కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుంది. రెండు రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. ఒకటి కాదు, రెండు కాదు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. కరోనా భయంతో రెండు రాష్ట్రాల్లో ప్రజలు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు.  

గడచిన 24 గంటల్లో 86,035 కరోనా పరీక్షలు నిర్వహించగా 14,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,831 కొత్త కేసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో 1,829, గుంటూరు జిల్లాలో 1,760, తూర్పుగోదావరి జిల్లాలో 1,702, అనంతపురం జిల్లాలో 1,538 కేసులు వెల్లడయ్యాయి. విశాఖ, నెల్లూరు జిల్లాల్లోనూ వెయ్యికి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

అదే సమయంలో 8,188 మంది కరోనా నుంచి కోలుకోగా, 57 మంది మరణించారు. తాజా పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,14,158కి పెరిగింది.