మరో చీతా పారిపోయింది..!

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ జాతి చీతాలు నిర్దేశిత ప్రాంతం దాటి బయటకు వెళ్తున్నాయి. ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్ ను అటవీ అధికారులు అనేక ప్రయత్నాల అనంతరం సురక్షితంగా పార్కుకు తీసుకువచ్చారు.  

ఇటీవల ఒక చీతా మరణించింది. ఇప్పుడు మరో చీతా పారిపోయింది. ఆశా అనే చీతా కూనో నేషనల్ పార్కులోని రిజర్వ్ ఫారెస్ట్ దాటి వీరుర్ ప్రాంతంలోని బఫర్ జోన్లోని వెళ్లిపోయింది. అది నదుల వెంట సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆశాకు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ పేరు పెట్టారు. ఈ చీతాల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని అటవీ అధికాలు చెబుతున్నారు.

చీతాలు జనావాస ప్రాంతాల్లో సంచరించవని తెలిపారు. అయితే, ఈ చీతా బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తూ.. ప్రజలను భయాందోళలకు గురిచేస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా ప్రధాని మోడీ చేతులమీద ప్రారంభించిన చీతాల పెంపక కార్యక్రమం.. అవి ఒక్కొక్కటిగా పారిపోతుండటంతో.. జూ అధికారులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు...