వెంకన్నదేవుడిని నెత్తిన పెట్టుకున్న పవన్ కల్యాణ్
posted on Jan 12, 2026 2:20PM

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం విషయంలో పట్టుదలగా ఉంటున్న సంగతి తెలిసిందే. తనను తాను సనాతన ధర్మం ఆచరించే వ్యక్తిగా చెప్పుకోవడమే కాకుండా, వాటి విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటూ, సందర్భం వచ్చినప్పుడల్లా తాను సనాతన ధర్మం పట్ల మెగ్గు చూపుతున్న విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఆ క్రమంలోనే ఆయన తాజాగా తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని నెత్తిన పెట్టుకుని దేవదేవుని పట్ల తనకున్న భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంక్రాంతి సంబరాలను తన సొంత నియోజకవర్గం పిఠాపురం జరుపుకుంటున్నసంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం వచ్చిన సందర్భంగా తనకు బహుమతిగా ఇచ్చిన కలియుగ దైవం వేంకటేశ్వరుడి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించి, ఆ విగ్రహాన్ని భక్తి పారవశ్యంతో తన నెత్తిన, భుజాన మోశారు.
తద్వారా తిరుమల వెంకన్నదేవుడిపై తనకున్న అపారమైన భక్తి భావాన్ని గర్వంగా ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కల్యాణ్ నిజమైన భక్తుడు అంటూ నెటిజనులు పెద్ద ఎత్తున ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు.