చిరంజీవి వరప్రసాద్ సినిమా చూస్తూ రిటైర్డ్ ఏఎస్ఐ మృతి

 

హైదరాబాద్ నగరంలో ఓ విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ థియేటర్ లో సినిమా చూస్తూ ఓ వ్యక్తి  మృత్యు వాత పడడంతో ఆ థియేటర్లో విషాదఛాయలు అలుము కున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా హైదరాబాదు నగరంలో ఉన్న పలు సినిమా థియేటర్ లలో విడుదల అయిన విషయం తెలిసిందే...ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన అభిమాన హిరో చిరంజీవి నటించిన సినిమా చూడడానికి వచ్చి అకస్మాత్తుగా మృతి చెందిన ఘటన కూకట్‌పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌లో  చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. 

లింగంపల్లికి చెందిన ఆనంద్ కుమార్  (63) ఏఎస్‌ఐగా విధులు నిర్వహించి 12వ బెటాలియన్ నుంచి రిటైర్ అయ్యారు. చిరంజీవి అభిమానిగా ఉన్న ఆయన ఈరోజు సోమవారం ఉదయం 11:30 గంటల షోకు కూకట్పల్లి పరిధిలోని అర్జున్ థియేటర్‌కు వచ్చారు. సినిమా ఆసక్తిగా వీక్షిస్తున్న సమయంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. క్షణాల్లోనే థియేటర్‌లో కుప్పకూలి కింద పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించిన ప్రేక్షకులు వెంటనే థియేటర్ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. 

ప్రాథమికంగా హార్ట్‌స్ట్రోక్‌ కారణంగానే ఆనంద్ కుమార్ మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగి స్తున్నారు. సినిమా థియేటర్‌ లోనే ఈ విధమైన విషాద ఘటన జరగడం పట్ల ప్రేక్షకులు, థియేటర్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిరంజీవి సినిమా ఆనందంగా చూడటానికి వచ్చిన ఓ అభిమాని ఇలా ప్రాణాలు కోల్పోయిన ఘటన  నగర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu