ఆంధ్రా మిర్చికంపెనీపై తెలంగాణావాదుల ఆగ్రహం

ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు పారిశ్రామికవేత్తలు కోట్లాదిరూపాయలు ఖర్చుపెట్టి ఖమ్మం-కోదాడ ప్రధానరహదారి పక్కన ముదిగొండలో ఏర్పాటు చేసిన పరిశ్రమపై తెలంగాణావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మిరపవిత్తనాల నుంచి ఆయిల్ ను తీసే ఈ పరిశ్రమ వల్ల ముదిగొండ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కాలుష్యం అయిపోతున్నాయని తెలంగాణావాదులు ఆరోపిస్తున్నారు. మిరపకాయల నుంచి తొడిమలు వేరు చేసి వాటి నుంచి గింజలను తీసి ఆ గింజల నుంచి తీస్తున్న ఆయిల్ ను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రోజుకు 2వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పరిశ్రమను రెండు నెలల క్రితమే ప్రారంభించారు.

దీనిని ఇప్పుడు తెలంగాణావాదులు లక్ష్యంగా పెట్టుకుని మూయించివేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మించాలంటే చుట్టుపక్కల ఐదుకిలోమీటర్ల పరధిలో ఎలాంటి జనాభా ఉండకూడదనే నిబంధన ఉందని, ఈ నిబంధన ను ఉల్లంఘించి ఆంధ్రా పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఫ్యాక్టరీ నెలకొల్పారని తెలంగాణావాదులు ఆరోపిస్తున్నారు. మిరప గింజల నుంచి ఆయిల్ తియ్యాలంటే 220డిగ్రీల ఫారిన్ హీట్ వద్ద వేడి చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వాయువుల వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నార ని తెలంగాణావాదులు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ మూసివేయాలంటూ వారు జిల్లా అధికార్లకు ఫిర్యాదులు పంపుతున్నారు. అధికారులు పట్టించుకోకపొతే ఫ్యాక్టరీ ఎదుట ఆందోళన చేపట్టాలని యోచిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu