హైద్రాబాద్ లో పట్ట పగలు అడ్వకేట్ దారుణ హత్య
posted on Mar 24, 2025 6:24PM
హైద్రాబాద్ చంపాపేటలో అడ్వకేట్ ఇజ్రాయిల్ దారుణ హత్యతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇజ్రాయిల్ నివసిస్తున్న అపార్ట్ మెంట్ లోనే ఉన్న మహిళపై ఎలక్ట్రిషన్ దస్తగిరి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. వేధింపుల గూర్చి అడ్వకేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో అడ్వకేట్ ఇజ్రాయిల్ పై దస్తగిరి కక్ష్య పెంచుకున్నాడు. అడ్వకేట్ సోమవారం విధులకు వెళుతున్న సమయంలో మాటు వేసి దస్తగిరి హత్యకు పాల్పడ్డాడు హత్య తర్వాత దస్తగిరి ఐ ఎస్ సదన్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. ఇజ్రాయిల్ హత్యకు నాలుగు రోజుల ముందే దస్తగిరి రెక్కీ నిర్వహించాడు. కాపు కాసి ఉదయం అడ్వకేట్ ను దుండగుడు హత్య చేశాడు. ఘటన తర్వాత కంచన్ బాగ్ లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన తర్వాత ఒక న్యాయవాది ప్రాణాలకే రక్షణ లేకపోతే సామాన్య వ్యక్తికి రక్షణ ఏ విధంగా ఉంటుంది అనే ప్రశ్న ఉత్పన్నమైంది.