అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రపంజా
posted on Jul 11, 2017 11:11AM

అనుకున్నదంతా అయ్యింది..ఏదైతే జరక్కూడదని కేంద్రప్రభుత్వం భయపడిందో అదే జరిగింది. పవిత్ర అమర్‌నాథ్ యాత్రికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పంజా విసిరారు. నిన్న రాత్రి అనంతనాగ్ జిల్లాలోని బటంగూ ప్రాంతంలో పోలీసులకు సంబంధించిన ఎస్కార్ట్ వ్యాన్‌పై నిన్న రాత్రి 8.20 గంటల ప్రాంతంలో సాయుధులైన ముష్కరులు దాడి చేశారు..వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ పరారయ్యారు. అదే సమయంలో హైవే మీదకు వస్తున్న అమర్‌నాథ్ యాత్రికుల బస్సుకు ముష్కరుల తూటాలు తగిలడంతో ఏడుగురు యాత్రికులు మరణించగా..11 మంది గాయపడ్డారు..వీరంతా అమర్‌నాథ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకుని వస్తున్నారు..అయితే రాత్రి 7 గంటల తర్వాత యాత్రా బస్సులు హైవే మీదకు తిరగకూడదని కానీ డ్రైవర్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకుంది పోలీసులు చెబుతున్నారు. మరోవైపు యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్రమోడీ తీవ్రంగా ఖండించారు..ఇలాంటి పరికిపంద చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
