ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తులకు సేవలు : టీటీడీ ఏఈవో

 

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 30, 31, జనవరి 1 వ తేదీల్లో టికెట్లు జారీ చేసింది. మూడు రోజుల పాటు టికెట్ల లేని భక్తులకు దర్శనం ఉండదు. 2వ తేదీ నుంచి 8 వ తేదీ వరకు ఇప్పటికే టిక్కెట్లు పొందిన భక్తులకు మూడు దశల్లో దర్శనానికి అనుమతించనున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వైకుంఠ ఏకాదశికి అలంకరణలు పూర్తి అయ్యాయి.

 స్వామి వారి ఆలయంతో పాటు ఆలయం బయట భారీ షెట్టుతో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అలంకరణలు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఇవాళ అర్ధరాత్రి దాటాక వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. ప్రతి చోటా టెక్నాలజీ వాడుకుంటున్నామని ఏఐ కమాండ్ కంట్రోల్ ద్వారా భక్తుల దర్శనం, వెయిటింగ్, వాహనాల పార్కింగ్ సహా అన్నింటినీ మానిటర్ చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా లడ్డూల కౌంటర్లు కూడా పెంచమని తెలిపారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu