తైవాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం

తైవాన్ కు భారీ భూకంపం కుదిపేసింది. ఈశాన్య తీర ప్రాంత నగరమైన ఇలాన్ లో రిక్టర్ స్కేలుపై 7 తీవ్రత నమోదైన ఈ భూకంపం ధాటికి భవనాలు, భారీ నిర్మాణాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. జనం తీవ్ర భయాందోళనలతో రోడ్లపైకి పరుగులు తీశారు.

ఇలాన్ కౌంటీ హాల్ కు 32 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం కేంద్రీకృతమూ ఉన్నట్లు అధకారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇలా ఉండగా ఈ భూకంపం కారణంగా సునామీ వచ్చే అవకాశాలు లేవని వాతావరణ సంస్థ ప్రకటించింది.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu