స్టైలిష్ 'బూచోడు' అల్లు అర్జున్

 

ప్రస్తుతం ఇద్దరమ్మాయిలతో రోమాన్స్ చేస్తున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్వరలో బూచోడు వేషంలో అభిమానులని భయపెట్టబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్న బూచోడు సినిమాని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) డా.కే. వెంకటేశ్వర రావులు కలిసి నిర్మించనున్నారు. ఈ సినిమాలో శ్రుతీ హస్సన్ అల్లు అర్జున్ తో జత కట్టబోతోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 18 నుండి మొదలవుతుంది. వక్కంతం వంశీ ఈ సినిమాకు కదా అందిస్తున్నారు. యస్.యస్.దామన్ సంగీతం అందిస్తారు.