రాజమౌళి 'బహుబలి'లో అడివి శేష్
posted on Apr 6, 2013 8:11PM
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న భారీ బడ్జెట్ మూవీ 'బహుబలి' లో తాజాగా మరో హీరో జాయిన్ అయ్యాడు. కర్మ, పవన్ కళ్యాణ్ పంజా సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్నలను పొందిన అడివి శేష్, 'బహుబలి' లో ఓ కీలకమైన పాత్రకు ఎంపికయ్యాడు. చారిత్రక నేపథ్యంతో తీయబోతున్న ఈ సినిమాలో అడివి శేష్ డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం కోసం శేష్ సాధన చేయడం మొదలుపెట్టాడు. ప్రభాస్ హీరోగా మగధీర కంటే ఎక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రాణా విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఏప్రిల్15 నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
అడివి సాయి కిరణ్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ 'కిస్' లో శేష్ హీరో గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో వుంది. మరోవైపు రవి తేజ హీరోగా నటిస్తున్న 'బలుపు'లో ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు.