ఇస్రో శాస్త్రవేత్తలకు పదేళ్ల బాలుడి లేఖ

 

చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి క్షణాల్లో విఫలమైనా.. ఇస్రో చేసిన అద్భుతమైన కృషికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ప్రయోగం విఫలమైన తరువాత ఇస్రో చైర్మన్ శివన్ కన్నీరు పెట్టుకోగా, ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రధాని మోదీ ఆయన్ను హత్తుకుని, స్థైర్యాన్ని కోల్పోవద్దని ఓదార్చారు. ఇక, తాజాగా పదేళ్ల బాలుడు ఆంజనేయ కౌల్‌ స్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ ఇస్రో శాస్త్రవేత్తలకు ఓ లేఖ రాయగా అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 


 
"స్థైర్యాన్ని కోల్పోవద్దు. మనం తప్పకుండా చంద్రుణ్ని చేరుతాం. వచ్చే జూన్‌లో లాంచ్‌ చేయనున్న ‘చంద్రయాన్‌-3’ మన లక్ష్యం. ఆర్బిటర్‌ ఇంకా చంద్రుడి కక్ష్యలో ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దు. అది మనకు ఫోటోలను పంపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ విత్తనాలను నాటి మొక్కలు పెంచాలో అదే మనకు చెబుతుంది. విక్రమ్‌ ల్యాండయ్యే ఉంటుంది. ప్రజ్ఞాన్‌ పనిచేస్తూ గ్రాఫికల్‌ బ్యాండ్స్‌ను మనకు పంపించేందుకు సిద్ధమవుతూ ఉండి ఉంటుంది. అదే జరిగితే విజయం మనచేతుల్లోనే. తదుపరి తరం పిల్లలకు ఇస్రో శాస్త్రజ్ఞులే స్ఫూర్తిదాయకం. ఇస్రో.. నువ్వు మాకు గర్వకారణం. దేశం తరఫున ఇస్రోకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జైహింద్‌." అని లేఖలో పేర్కొన్నాడు.