బస్సు బోల్తా.. పదిమంది మృతి

 

జార్ఖండ్ రాష్ట్రంలోని గర్హ్ వా జిల్లాలో సోమవారం తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి పట్నా వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గర్హ్ వా జిల్లాలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. గాయపడినవారు గర్హ్ వాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. తెల్లవారు ఝామున మూడు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని క్షతగాత్రులు చెబుతున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు.