యోగా చేయండి.. హ్యాపీగా వుండండి

 

యోగా చేయండి.. మానసికంగా, శారీరకంగా సంతోషంగా వుండండి. బస్... అంతే... ఇంతకంటే యోగా గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. యోగా చేస్తే మానసికంగా, శారీరకంగా సంతోషంగా వుంటాం. ఇది తిరుగులేని సత్యం. ఈ సత్యాన్ని ప్రపంచానికి అందించిన గొప్పతనం మన భారతదేశానిది. మన దేశంలోనే పుట్టిన యోగా కొంతకాలం పాటు మనదేశంలోనే నిర్లక్ష్యానికి గురైంది. ప్రపంచమంతా యోగాను అనుసరిస్తుంటే కళ్ళు తెరిచి మళ్ళీ యోగా చేసే యోగాన్ని భారతదేశం పొందింది. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చేసిన ఒక గొప్ప పని జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించడం. జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా యోగా చేయడానికి కోట్లాదిమంది ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. మనమూ 21న తప్పకుండా యోగా చేద్దాం. ఆ ఒక్కరోజే కాదు.. రోజూ యోగా చేద్దాం. మన శరీరం కోసం, మన మనసు కోసం... మనకోసం మనం చేసుకునే ఒక మంచి పని యోగా.

భారతీయ యోగాని ప్రపంచమంతా 21న ఒక ఉత్సవంలా ఆచరిస్తుంటే, మనదేశంలోని రాజకీయ పార్టీలు మాత్రం ఈ విషయాన్ని కూడా రాజకీయం చేసి ఏమైనా బావుకుందామనం తాపత్రయపడుతున్నాయి. అది ఆయా పార్టీల కుత్సిత బుద్ధికి నిదర్శనం. యోగాకి, సూర్య నమస్కారాలకు కూడా మతం రంగు పులుముతున్నారు. సూర్య నమస్కారాలు ఇతర మతాలవారు చేయకూడదట. అలా చేయాలని ప్రభుత్వం నిర్బంధపెడుతోందట.. ఇలాంటి దుష్ప్రచారం చేయడానికి ఆ పార్టీలకు... ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మనసెలా వస్తోందో అర్థం కావడం లేదు. సూర్యుడు హిందువులకు మాత్రమే దైవమా? ప్రపంచంలోని అందరికీ దైవం.. ఆసక్తికులకు మాత్రమే కాదు.. నాస్తికులకు ఆయనే ప్రత్యక్ష దైవం. అలాంటి సూర్యుడి హిందువులకు ఇచ్చేసినందుకు హిందువులు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పాలా? వద్దండి... ఈ రాజకీయాల జోలికి మనం వెళ్ళొద్దు.. ఆ పార్టీలను వాళ్లు సృష్టించిన మురికి కూపాల్లోనే జీవచ్ఛవాల్లా వుండనిద్దాం. మనం మాత్రం  చక్కగా 21న ప్రపంచంలోని కోట్లాదిమందితోపాటు మనం కూడా యోగా చేద్దాం.. ఆ తర్వాత కూడా ప్రతి రోజూ యోగా చేద్దాం... శారీరకంగా, మానసికంగా సంతోషంగా వుందాం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu