అమ‌రావ‌తి విష‌యంలో...జ‌గ‌నాసురుడి అస‌లు స్కెచ్ అదేనా?

 

అమ‌రావ‌తి అంటే అర్ధ‌మేంటి? అని చూస్తే అమ‌రులుండే  ప్ర‌దేశం. దీనికి  మ‌ర‌ణం లేదు అని అర్ధం. ఇంకా చెబితే ఇంద్రుడి రాజ్యాన్ని కూడా  అమ‌రావ‌తీ అనే  అంటారు. ఇక బుద్ధుడు కాల‌చ‌క్ర బోధ‌న‌లు చేసిన ప్రాంతం కూడా ఇదే. ఇంత‌టి ఆధ్యాత్మిక‌, చారిత్ర‌క ప్ర‌దేశం కాబ‌ట్టే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానికి ఈ  పేరు పెట్టారు. ఇంద్రుడి  రాజ‌ధాని అమ‌రావ‌తిపై కూడా ఎన్నోసార్లు రాక్ష‌సులు దాడులు చేశారు. అప్పుడా దేవ‌త‌లు శ్రీమ‌హావిష్ణువును వేడుకోగా ఆయ‌న ద‌శావ‌తారాల ద్వారా ఈ రాజ‌ధానిని కాపాడిన ఉదంతాలు ఆధ్యాత్మికంగా  కోకొల్ల‌లు.ఆనాడు రాక్ష‌సులు ఎలా అమ‌రావ‌తిని అంతం చేయాల‌ని భావించారో.. ఇప్పుడు కూడా జ‌గ‌నాసురుడి వంటి రాక్ష‌సుల‌ తాకిడి ఎదుర్కుంటూనే ఉందీ రాజ‌ధాని. 

తాజాగా  కూడా  రివ‌ర్ బేసిన్ లో రాజ‌ధాని  నిర్మాణ‌మా అంటూ అమ‌రావ‌తిపై త‌న అక్క‌సు మొత్తాన్ని వెళ్ల‌గ‌క్కారు జ‌గ‌న్ మోహ‌న రెడ్డి. ఆయ‌న ఇంగ్లీష్ లో చెప్పినా  దాని అర్ధం అమ‌రావ‌తి  నిర్మాణం త‌న‌కు ఇక్క‌డ ఇష్టం లేద‌ని చెప్ప‌డ‌మే. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయ‌డానికి మాజీ స‌క‌ల శాఖ‌ల మంత్రి స‌జ్జ‌ల రంగ ప్ర‌వేశం చేసి.. అమ‌రావ‌తి అంటే త‌మ‌కెలాంటి బేధాభిప్రాయాలు లేవ‌ని అన్నారు.  అయితే జ‌గ‌న్ చెప్పిన దానికీ దీనికి  చాలానే తేడా  క‌నిపిస్తోంది. అంటే అధినేత  ఇక్క‌డ అమ‌రావ‌తి నిర్మించ‌డ‌మేంట‌ని అంటే ఇక వెంట‌నే  ఆ అధినేత బంటు వ‌చ్చి తూచ్ అలాంటిదేదీ లేద‌ని చెప్ప‌డంలో ఒక మ్యాజిక్ దాగి ఉంద‌నే చెప్పాల్సి ఉంటుంది.

అదెలాంటిదో చూస్తే.. గ‌తంలో నాని, ఆపై జోగి, నేడు స‌జ్జ‌ల వీరంద‌రి చేత అమ‌రావ‌తి అంటే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్పించ‌డం. దీంతో జ‌గ‌న్ పార్టీ అమరావ‌తిపై ఎలాంటి వ్య‌తిరేక‌ఖ‌త లేద‌ని జ‌నం గంపగుత్త‌గా  ఓట్లు వేస్తార‌న్న వ్యూహం ఇందులో దాగి ఉన్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఇదే అమ‌రావ‌తిపై జ‌గ‌న్ ఇంగ్లీష్ లో  వ‌ద్ద‌ని చెప్ప‌డంలో ఇంకో వ్యూహం దాగి ఉంది.గ‌తంలో అమ‌రావ‌తి అంటే త‌న‌కెలాంటి వ్య‌తిరేక‌త లేద‌ని ఆయ‌న స్ప‌ష్టంగా తెలుగులో అది  కూడా అసెంబ్లీ వేదిక‌గా చెప్ప‌డం వ‌ల్ల‌.. గ‌త ఐదేళ్ల వైసీపీ  జ‌మానాలో ఎలాంటి న‌ష్టం జ‌రిగిందో తెలిసిందే. అప్ప‌ట్లో జ‌గ‌న్ ఒప్పుకున్నాడు క‌దా? అనే మాట  ప‌దే ప‌దే వినిపించింది. అదే ఇప్పుడు త‌న వారంద‌రి చేత అవున‌నిపించి తాను మాత్రం కాద‌న‌డం వ‌ల్ల అది కూడా ఆంగ్లంలో.. ఇదొక స్కెచ్ గా  తెలుస్తోంది.

ఈ  స్కెచ్ ద్వారా వ‌చ్చే రోజుల్లో ఆంధ్రుల క‌ర్మ‌గాలి పొర‌బాటున  ఫ్యాను గాలి వీస్తే.. ఆపై తాను ఆనాడే చెప్పాన‌ని త‌ప్పించుకునేలా ఒక వెస‌లుబాటు క‌ల్పించుకున్నారు జ‌గ‌న్. అంతే  కాకుండా ఆయ‌న ద‌గ్గ‌ర ఇంకో థియ‌రీ కూడా రెడీగా  ఉండ‌నే  ఉంది. తాను ఎక్క‌డుంటే అదే రాజ‌ధానిగా  ఆయ‌న ఇది వ‌ర‌కే స్టేట్మెంట్ ఇచ్చేశారు. దీంతో తాను రిషికొండ ప్యాలెస్ లో కూర్చుని... ముందే చెప్పానుగా ఇదే మ‌న రాజ‌ధాని అంటూ ఆయ‌న ప్లేటు ఫిరాయించ‌డానికే ఇదంతా అన్న సంకేతాలు స్ప‌ష్టంగా అందుతున్నాయ్. కాబ‌ట్టి... బీఅవేర్ ఆఫ్ జ‌గ‌నాసుర! అన్న హెచ్చ‌రిక‌లు సైతం అంతే  స్థాయిలో సైర‌న్ మోగుతోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu