అబ్బో.. రోషం పొడుచుకొచ్చిందే...
posted on Jun 20, 2015 5:25PM

ఓ బిచ్చగాడికి ఒకరోజున ఎవరూ బిచ్చం వేయలేదట.. కడుపు మండిపోయిన ఆ బిచ్చగాడు ‘‘ఎప్పుడూ బిచ్చం వేయని తల్లి ఎలాగూ బిచ్చం వేయలేదు.. రోజూ బిచ్చం వేసే (ఇక్కడ బూతు) కూడా ఈరోజు బిచ్చం వేయలేదు’’ అని తిట్టుకున్నాడట. ప్రస్తుతం ఒక పెద్దమనిషి వ్యవహారం కూడా అలాగే వుంది. గతంలో ఆయన్ని ఒక వర్గం వారు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. వివిధ సందర్భాల్లో వాళ్ళు ఆయనగార్ని తిట్టిన తిట్లన్నీ రికార్డు చేసి ఒకేసారి విన్నామంటే కర్ణభేరి పగిలిపోవడం ఖాయం. ఆ రోజుల్లో ఆయన అంతలా తిట్లు తిన్నా ఏనాడూ కిక్కురుమనలేదు. అసలు వాళ్ళు తిడుతోంది తనను కాదన్నట్టుగానే కూల్‌గా వుండేవారు. అయితే ఆ పెద్దమనిషిని ఏనాడూ తిట్టి ఎరగని వాళ్ళు ఇప్పుడు కడుపు మండి, ఏదో నోరు జారి ఒక్క మాట అన్నారు. అంతే ఆయనకి రోషం పొడుచుకొచ్చేసింది. అలా తిట్టినవారు బుద్ధి తక్కువైపోయి తిట్టాం క్షమించండి మహప్రభో అని లెంపలు వేసుకునేలా చేసే వరకు ఆయన శాంతించలేదు. తిట్టించుకునే విషయంలో కూడా ఈ పక్షపాతం ఏంటి మహప్రభో!?