విపక్షాలు వారిని అవమానించినట్టే..
posted on Nov 30, 2016 12:04PM
పార్లమెంట్ ఉభయసభలు ఈరోజు కూడా ఆందోళనలతో దద్దరిల్లిపోయాయి. లోక్ సభలో నగ్రోటా కాల్పులపై చర్చలు జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నగ్రోటాపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని.. ఈ అంశంపై తాము చర్చకు సిద్దమంటే కాంగ్రెస్ ముందుకు రాకపోవడం నగ్రోటా అమరవీరులను అవమానించినట్టేనని తెలిపారు. అసలు కాంగ్రెస్‌కు సభను సజావుగా సాగనిచ్చే ఉద్దేశ్యమేలేదన్నారు.
ఇంకా కేంద్రమంత్రి అనంతకుమార్ కూడా మాట్లాడుతూ..దేశ భద్రత అంశాన్ని రాజకీయం చేయొద్దని.. సరిహద్దుల్లో కూంబింగ్ కొనసాగుతోందని తెలిపారు. పెద్దనోట్ల రద్దుపై చర్చకు సిద్ధమేనని ప్రభుత్వం చెబుతున్నా.. విపక్షాలు కావాలనే సభా కార్యకలాపాలు అడ్డుకుంటున్నాయని మంత్రి ఆరోపించారు.