స్వల్పంగా గాయపడ్డ కోహ్లీ...

 

 

రాంచీలోని జేఎస్‌సీఏ మైదానం వేదికగా.. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్‌ గెలిచిన ఆసీస్  బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు.  ఇన్నింగ్స్ 39వ ఓవర్ తొలి బంతిని ఆసీస్ బ్యాట్స్ మెన్ హ్యాండ్స్ కాంబ్ బౌండరీకి తరలించే ప్రయత్నం చేశాడు. దీంతో బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపేందుకు కోహ్లీ డైవ్ చేయగా స్వల్పంగా గాయపడ్డాడు. భుజం నొప్పికి గురవడంతో మైదానాన్ని వీడాడు. అనంతరం కాసేపటి తర్వాత మళ్లీ ఫీల్డింగ్ కు వచ్చాడు. కాగా నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జ‌ట్లు చెరో మ్యాచు గెలిచిన సంగ‌తి తెలిసిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu