సింగర్ కు ట్రంప్ వార్నింగ్..

 

ఆఖరికి ఓ ప్రముఖ ర్యాపర్ కు కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ట్రంప్ వార్నింగ్ ఇచ్చేంతలా ఆ ర్యాపర్ ఏం చేశాడనుకుంటున్నారా..? అసలు సంగతేంటంటే... ప్రముఖ ర్యాపర్‌ స్నూప్‌ డగ్‌ మూడో రోజుల కిందట విడుదల చేసిన ఓ వీడియో సాంగ్‌లో ట్రంప్‌ అవతారంలో ఉన్న విదూషకుడిని ఫేక్‌ తుపాకీతో కాలుస్తున్నట్టు స్నూప్‌ చూపించారు.  'లావెండర్‌' పేరుతో రూపొందించిన ఈ మ్యూజిక్‌ వీడియోలో అమెరికాలో పోలీసుల క్రూరత్వాన్ని, ట్రంప్‌ తీరును ఎండగట్టారు. ఇక దీనిపై స్పందించిన ట్రంప్.. స్నూప్ డగ్ కు గట్టి వార్నింగే ఇచ్చినట్టు తెలుస్తోంది. 'స్నూప్‌ డగ్‌ గతంలో ఇదేవిధంగా అధ్యక్షుడు ఒబామాకు గురిపెట్టి తుపాకీ కాలిస్తే ఏమయ్యేదో తెలుసా? జైలుకు వెళ్లాల్సి వచ్చేది' అంటూ పరోక్షంగా గాయకుడిని హెచ్చరించారు. ఇక దీనిపై స్పందించిన ట్రంప్‌ తరఫు లాయర్లు సైతం..స్నూప్‌ డగ్‌ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరి అతను క్షమాపణలు చెబుతాడో లేదో చూద్దాం...

Online Jyotish
Tone Academy
KidsOne Telugu