హెచ్-బీ వీసాలపై యూఎస్ తాజా ప్రకటన...ఐటీ కంపెనీలకు ఊరట
posted on Mar 16, 2017 1:22PM
.jpg)
హెచ్-బీ వీసాలపై యూఎస్ తీసుకుంటున్న నిర్ణయాలపై భారత్ టెన్షన్ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఇండియన్ ఐటీ కంపెనీలకు ఊరట కలిగించే విధంగా యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. తాత్కాలికంగా హెచ్-1బీ దరఖాస్తులపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ ఈ మధ్యే ప్రకటించినా.. మళ్లీ వెనక్కి తగ్గింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను ఏప్రిల్ 3 నుంచి హెచ్-1బీ దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఎప్పటివరకు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారన్నది మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా తొలి ఐదు వర్కింగ్ డేస్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. 2017, అక్టోబర్ 1 నుంచి యూఎస్ ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. కాగా ప్రతి ఏటా 85 వేల హెచ్-1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది.