టీడీపీ రాజ్యసభ సభ్యులు వీరే... బీజేపీ తరపున సురేష్ ప్రభు..

 

ఏపీ టీడీపీ నుండి పోటీచేసే అభ్యర్దులు ఖరారైనట్టు తెలుస్తోంది. ఏపీ కోటాలో రాజ్యసభకు నాలుగు సీట్లు రాగా.. అందులో టీడీపీకి మూడు, వైసీపీకి ఒక స్థానం దక్కింది. టీడీపీ మూడు స్థానాల్లో టీజీ వెంకటేష్, మరొకటి కేంద్రమంత్రి సుజనా చౌదరికి దక్కగా.. బీజేపీకి కేటాయించిన స్థానం నుండి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభుకు సీటు దక్కింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్వయంగా తన ట్విట్టర్లో పేర్కొన్నారు.