నేడు పుట్టపర్తికి ప్రధాని, సోనియా
posted on Apr 26, 2011 9:18AM
పుట్టప
ర్తి: సత్య సాయిబాబాకు అంతిమ నివాళులర్పించడానకి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం సాయంత్రం పుట్టపర్తికి రానున్నారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి ఈ విషయాన్ని ధ్రువీకరించి సాయంత్రం 4.30 గంటలకు వారు పుట్టపర్తికి చేరుకుంటారని చెప్పారు. ప్రధాని, సోనియా వస్తున్నట్లు అధికారికంగా ఖరారు కావడంతో సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులు భద్రతా చర్యలపై చర్చించారు. సెంట్రల్ ట్రస్టు సభ్యులతో కూడా వారు సమావేశమయ్యారు. ప్రత్యేక బోయింగ్ విమానంలో పుట్టపర్తికి చేరుకున్న ఎయిర్ ఫోర్సు అధికారులు విమానాశ్రయంలో రక్షణ చర్యలను పరిశీలించారు. ప్రధాని భద్రతా దళానికి చెందిన అధికారులు విమానాశ్రయం నుండి ప్రశాంతి నిలయం వరకు ట్రైల్ రన్ నిర్వహించారు.