శ్రీకృష్ణపై సభా హక్కుల నోటీసు
posted on Apr 26, 2011 9:01AM
హైదరాబా
ద్: హైకోర్టు తీర్పు చూశాక శ్రీకృష్ణ కమిటీపై సభా హక్కుల నోటీసు విషయంపై నిర్ణయం తీసుకుంటానని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం న్యాయమైన అంశాలపై న్యాయ నిపుణులతో చర్చించి నిర్ణయాన్ని వ్యక్త పరుస్తామని చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయాన్ని కేంద్రం తప్పకుండా బయట పెట్టాల్సిందేనని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఆత్మబలిదానాలు ఆపకపోతే అందరూ తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ఏ ఒక్కరిపైనో లేదన్నారు. ఆ బాధ్యత అన్ని పార్టీల పైన ఉందని చెప్పారు. తెలంగాణ విషయంలో రాజకీయ పక్షాలు ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు.