కేంద్ర బడ్జెట్...పేదల నడ్డి విరుస్తున్న కేంద్రం

 

ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్ సామాన్యులకి ఉపయుక్తంగా ఉంటుందని అనుకుంటే కేంద్రం మాత్రం సామాన్యుల నడ్డ్డి విరిచేలా పన్నుల వడ్డన సాగించింది. ఈ క్రమంలో పెట్రోలు, డీజిల్, బంగారం ధరలపై కస్టమ్స్ సుంకాన్ని పెంచి మధ్యతరగతి వారి మీద భారం మోపింద. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో లీటర్ పెట్రోల్, డీజీల్‌లపై కస్టమ్స్ సుంకాన్ని రూ.1 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించారు. 

ఈ బడ్జట్ వల్ల ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయో, ఏయే వస్తువులు పెరగనున్నాయో చూద్దాం. ముందుగా పెరిగే వాటిని పరిశీలిస్తే పెట్రోల్, డీజిల్, దిగుమతి చేసుకునే బంగారం, దిగుమతి చేసుకునే లోహాలు, సీసీటీవీ మరియు ఐపీ కెమెరాలు (ఇంటర్నెట్ ప్రొటోకాల్ కెమెరాలు), మెటల్ ఫిట్టింగ్స్, దిగుమతి చేసుకునే స్ప్లిట్ ఏసీలు, సిగరెట్లు, చుట్టలు, పొగాకు, పాన్ మసాలా, దిగుమతి చేసుకునే ప్లాటినం, దిగుమతి చేసుకునే ఆటోమొబైల్ పార్ట్స్, దిగుమతి చేసుకునే లౌడ్ స్పీకర్లు, దిగుమతి చేసుకునే ప్లగ్గులు, సాకెట్లు, స్విచ్చిలు, స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువులు లాంటి వాటి రెట్లు పెరగనున్నాయి. 

ఇక దిగుమతి చేసుకునే ఈ-వెహికల్స్ విడి భాగాలు, కృత్రిమ మూత్రపిండాలకు వాడే ముడి పదార్థాలు, దిగుమతి చేసుకునే ఉన్ని, దిగుమతి చేసుకునే డిఫెన్స్ పరికరాల రేట్లు గృహ రుణాలు, రక్షణ సామగ్రి, సెల్‌ఫోన్‌ ఛార్జర్లు, సెట్‌టాప్‌ బాక్సులు, మొబైల్‌ ఫోన్లలో వినియోగించే లిథియం బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ కారులు, బైక్‌లు, ఛార్జింగ్‌ సైకిళ్ల రేట్లు తగ్గనున్నాయి. ఇక బడ్జెట్ ప్రభావంతో 380.25 పాయింట్ల వ‌ద్ద ట్రేడింగ్ ప్రారంభించిన భార‌త్ పెట్రోలియం షేర్లు 2.42 శాతం పతనమయ్యాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu