పిత్తకోశం (గాల్ బ్లాడర్)

1. మీకు జ్వరం వస్తుందా?

గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ (కొలిసిస్టైటిస్)

2. నొప్పి వచ్చిపోతూ ఉంటుందా?

పిత్తాశయంలో రాళ్ళు (గాల్ స్టోన్స్)

 

కాలేయానికి కొద్దిగా వెనుక భాగంలో పిత్తకోశం ఉంటుంది. ఇది కాలేయం నుంచి విడుదలయ్యే పదార్థాలను సరాసరి పెగులలోకి వెళ్లనివ్వకుండా అవసరానుసారం తగిన మోతాదులో పంపుతుంటుంది. పిత్తరసంలోని ఎంజైములు ఆహారంలోని కొవ్వు పదార్థాలను జీర్ణం చేస్తాయి. ఈ పిత్తకోశం వ్యాధిగ్రస్తమైతే - నూనెలు, కొవ్వు మొదలైనవి అరగాకపోవడం వల్ల కడుపు ఉబ్బరింపు, గ్యాస్ తయారవ్వడాలు ఉంటాయి. గాల్ బ్లాడర్ కు సంబంధించిన నొప్పి ముందువైపు కాకుండా వెనుక భాగాన, అంటే వీపులో కూడా వచ్చే అవకాశం ఉంది.

1. గాల్ బ్లేడర్ ఇన్ఫెక్షన్ (కోలిసిస్టైటిస్):

గాల్ బ్లాడర్ కి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు దానిని వైద్య పరిభాషలో 'కోలిస్ స్టైటిస్' అంటారు. ఈ వ్యాధిలో కొవ్వు పదార్థాలూ, నూనెలూ, అరుగకపోవడం, కుడివైపు డొక్కలో - - పై భాగాన నొప్పి రావడం ఉంటాయి. మలవిసర్జన దుర్వాసనతోనూ, నురుగతోనూ ఉంటుంది.

ఔషధాలు: మహాగంధకరసపర్పటి, పంచామృతపర్పటి, మహాశంఖవటి, రాజవటి.

2. పిత్తాశయంలో రాళ్ళు (గాల్ స్టోన్స్):

చాలామందిలో గాల్ బ్లాడర్ స్టోన్స్ కాకతాళీయంగా - ఏ స్కానింగ్ తీయిస్తున్నప్పుడో - బయట పడుతుంటారు. పురుషులలో కంటే స్త్రీలల్లో, అందునా స్థూలకాయులలో ఇవి ఎక్కువగా తయారవడాన్ని బట్టి హార్మోన్ల నూ, కొలెస్టరాల్ నూ దీనికి కారణాలుగా భావించవచ్చు. కొలెస్టరాల్ గట్టిపడటం వలన పిత్తజాశ్మరి (గాల్ స్టోన్స్) తయారవుతాయి. చాలా మందిలో గాల్ స్టోన్స్ తయారు కావడమూ, వాటంతట అవే బయటకు వెళ్లిపోవడమూ లక్షణ రహితంగా జరిగిపోతుంటుంది. అయితే ఎప్పుడైతే ఇవి తమ మార్గాన్ని తామే అడ్డుకుంటాయో అప్పుడు కడుపులో తెరలు తెరలుగా నొప్పి వస్తుంది. పెగులలోకి వెళ్లాల్సిన జఠర రసం (బిల్ జ్యూస్) గాల్ స్టోన్స్ చేత అడ్డగించబడి, వ్యతిరేక దిశలో ప్రయాణించి, రక్తంలోకి విలీనమై కామెర్లను కలిగిస్తుంది.

గృహచికిత్సలు: 1. గోమూత్రంలో కరక్కాయలను ఉడికించి,మ్ ఎండించి పొడిచేయాలి. దీనికి లోహభస్మం, బెల్లం కలిపి తీసుకోవాలి. 2. వేపాకురసాన్ని పూటకు రెండు చెంచాలు చొప్పున రెండుపూటలా తీసుకోవాలి. 3. త్రిఫలాలు, వేప బెరడు, కటికరోహిణి, రేలగుజ్జు వీటినన్నిటిని సమానభాగాలు కలిపి కషాయం కాచి పూటకు అరకప్పు వంతున రెండు పూటలా చెంచాడు తేనె చేర్చి తీసుకోవాలి. 4. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఇంగువ, శంఖభస్మం, సైంధవలవణం అన్నీ సమభాగాలుగా తీసుకొని పొడిచేసి ఒకటిగా కలపాలి. దీనిని అరచెంచాడు చొప్పున వేడి నీళ్ళతో రెండుపూటలా తీసుకోవాలి.

ఔషధాలు: ఆరోగ్యవర్ధినీ వటి, మేదోహరవిడంగాదిలోహం, చంద్రప్రభావటి. క్లోమం (ప్యాంక్రియాస్) క్లోమం రెండు ప్రధానమైన పనులు చేస్తుంది; ఎంజైముల ద్వారా ఆహారాన్ని పచనం చేయడం మొదటిదైతే, రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించే ఇన్సులిన్ ను తయారు చేయడం రెండవది. మద్యపానం, ధూమపానం, క్యాన్సర్ వంటి వాటి వలన క్లోమం వ్యాధిగ్రస్తమైతే, దీని నుంచి విడుదలయ్యే స్రావాలు చుట్టుపక్కల కణజాలాలలోకి కలిసిపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.

ప్యాంక్రియాటైటిస్ పిలిచే ఈ స్థితిలో వాంతులు, స్వేదాధిక్యత, పడుకున్నప్పుడు నొప్పి ఎక్కువ కావడం, వీపులోనికి నొప్పి ప్రసరించడం వంటివి ఉంటాయి. దీనికి 'పిత్తహర చికిత్సలు' చేయాల్సి ఉంటుంది.

ఔషధాలు: అవిపత్తికరచూర్ణం, ప్రవాళపిష్టి, కామదుఘరసం, సూతశేఖర రసం.

 

మూత్రపిండాలు (కిడ్నీలు)

వీపు కింది భాగాన, వెన్నుపూసకు ఇరుపక్కలా మూత్రపిండాలు ఉంటాయి. ఇవి రక్తం నుంచి వ్యర్థ పదార్థాలను వేరు పరచి మూత్రనాళం (యూరెటర్స్), మూత్రాశయం (బ్లాడర్), మూత్రమార్గం (యురెత్రా)ద్వారా విసర్జిస్తుంటాయి.ఒకోసారి మూత్రపిండానికి చెందినా నొప్పిని మామూలు కడుపునొప్పిగా పొరపడేందుకు అవకాశం ఉంది.

జ్వరంతో పాటు చాలా సార్లు మూత్రానికి వెళ్ళాలనిపిస్తున్నప్పుడు మూత్రపిండాల ఇన్ఫెక్షన్ ను అనుమానించాలి. అలాగే 'పదునైన నొప్పి' వీపు నుంచి మొదలై గజ్జల నుండి తొడలలోకి ప్రసరిస్తున్నప్పుడూ, మూత్రం రక్తంతో కలిసి కనిపిస్తున్నప్పుడూ, మూత్రపిండాలలో రాళ్లను గురించి ఆలోచించాలి. పాషాణభేద, గోక్షుర వంటివి ఈ స్థితిలో ఉపయోగపడే మూలికలు.

ప్రేవులు కడుపులో చిన్న పేగులు, పెద్దపేగులు ఉంటాయి. వీటి వలన కూడా కడుపు నొప్పి వస్తుంది.

 

ఉదరంలో ఎడమవైపు పై భాగం ఉదార ప్రాంతం ఎడమవైపు పై భాగంలో ప్లీహం (స్ప్లీన్), అమాశయం (స్టమక్), క్లోమం (ప్యాంక్రియాస్), పేగులు, ఉదర వితానం (డయాఫ్రం) ఉంటాయి.