స్ట్రెస్‌కు అసలు కారణం ఇదే! మనసులో మార్పు ఎలా రావాలి?
మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, సమస్యలకు బయట పరిస్థితులే కారణమా? లేక మనలోని ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయా? ఈ వీడియోలో Inner Engineering అంటే ఏమిటి? మనలోని ఆలోచనా విధానం మారితే మన ప్రవర్తన, నిర్ణయాలు, జీవన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాలను డాక్టర్ శారదా దేవి, Professor of Human Development and Family Studies వివరిస్తున్నారు. మనల్ని మనం అర్థం చేసుకోవడం, Self-Awareness పెంచుకోవడం, మన ఆలోచనలు మరియు ప్రవర్తనను గమనించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు ఎలా తీసుకురావచ్చో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. Stress Relief, Mental Well-being, Self-Awareness, Motivation వంటి అంశాలపై ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreగుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి డాక్టర్లు చెప్పిన సలహాలు..!
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే పని కాదు. నేటి ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, ముందే మన లైఫ్ స్టైల్ లో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. చురుగ్గా ఉండటం.. బాగా వర్కవుట్లు చేయలేకపోయినా, రోజూ కొంత సమయం నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్యమధ్యలో లేచి కాసేపు అటుఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది. ఆహారం.. బరువు తగ్గడం కోసమే కాకుండా, శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఎంత పరిమాణంలో ఉందో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించడం చాలా అవసరం. దీర్ఘకాలంలో గుండెకు మేలు చేసే బాలెన్స్డ్ ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు.. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం.. ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి చాలా సాధారణమైపోయింది. ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మనస్సును, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సంగీతం వినడం, ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. రోజులో కొంత సమయాన్ని మనస్సును తేలికపరిచే కార్యకలాపాల కోసం కేటాయించడం చాలా ఉపయోగకరం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏవేవో ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో నడకను భాగం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. *రూపశ్రీ.
read more60 ఏళ్ల తర్వాత మతిమరుపు ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
60 ఏళ్లు దాటిన తర్వాత మతిమరుపు పెరగడం సహజమేనా? కుటుంబ సభ్యుల పేర్లు లేదా బంధుత్వాలను గుర్తుపట్టలేకపోవడం, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది పడటం వంటి మార్పులు కనిపిస్తే వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇవి సాధారణ మతిమరుపు లక్షణాలా? లేక డిమెన్షియా, అల్జీమర్స్ వంటి సమస్యలకు సంకేతాలా? ఈ వీడియోలో డాక్టర్ ప్రవీణ్ కుమార్ 60 ఏళ్ల తర్వాత కనిపించే మతిమరుపు, జ్ఞాపకశక్తి తగ్గడం, రోజువారీ పనుల్లో ఎదురయ్యే ఇబ్బందులు, అల్జీమర్స్ మరియు డిమెన్షియాకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను వివరిస్తున్నారు. జ్ఞాపకశక్తిలో మార్పులు కనిపించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్యుల సలహా ఎందుకు అవసరమో కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో కొన్ని హోమియోపతి మందులు, వైద్య అనుభవాలకు సంబంధించిన విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. అయితే మతిమరుపు, డిమెన్షియా లేదా అల్జీమర్స్ సమస్యలకు సొంతంగా మందులు వాడకుండా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన వైద్య పరీక్షల ద్వారా సమస్యకు కారణాన్ని గుర్తించుకోవాలి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreకారణం లేకుండానే అశాంతిగా చిరాకుగా అనిపిస్తోందా ఇదిగో అసలు కారణాలు ఇవే..!
ఆధునిక కాలంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే మనస్సులో ఆందోళన, భయం, ఒక రకమైన అశాంతి కలగడం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. బయటకు పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, లోపల ఏదో తెలియని బెంగ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనికి ఏదో పెద్ద సమస్యే కారణం కావాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జీవనశైలి అలవాట్లే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆందోళనను పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే.. శారీరక శ్రమ లేకపోవడం.. శారీరక శ్రమ లేకపోవడం మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించడమే కాకుండా, మనస్సుకు ఉపశమనం కలిగించే హార్మోన్ల విడుదల తగ్గుతుంది. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం లేదా నడక చేయడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. శారీరక చురుకుదనం తగ్గినప్పుడు మనస్సులో నెగిటివ్ ఆలోచనలు పెరిగి ఆందోళనకు దారితీస్తాయి. సోషల్ మీడియా.. నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించడం మానసిక అశాంతికి మరో ముఖ్యమైన కారణం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం, ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వంటివి తెలియకుండానే ఒత్తిడిని పెంచుతాయి. డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి నిద్ర లేమికి కారణమవుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడు అలసిపోయి, చిరాకు , భయాలు పెరిగే అవకాశం ఉంది. చెడు అలవాట్లు.. మద్యపానం లేదా ఇతర వ్యసనాలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినట్లు అనిపించినప్పటికీ, ఎక్కువ కాలంలో అవి మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. ఇవి నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి, ఆందోళన తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరం ఈ పదార్థాలపై ఆధారపడటం మొదలైనప్పుడు అశాంతి మరింత తీవ్రమవుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు.. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి నచ్చిన పనులపై దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు , మంచి నిద్రను అలవర్చుకోవడం ఎంతో అవసరం. జీవనశైలిలో చేసుకునే ఈ చిన్న మార్పులు మానసిక ఒత్తిడిని తగ్గించి జీవితంలో ప్రశాంతతను నింపుతాయి. *రూపశ్రీ.
read moreషుగర్ కంట్రోల్ కావట్లేదా ఈ 5 పొడుల గురించి డాక్టర్ ఏం చెప్పారో తెలుసా.!
మధుమేహం ఉన్నవారు రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నియంత్రణతో పాటు వివిధ సంప్రదాయ పద్ధతుల గురించి కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన విషయాలను Dr. Ch. Madhusudhana Sharma ఈ వీడియోలో వివరిస్తున్నారు. మధుమేహం విషయంలో శరీరంలోని జీవక్రియలు, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి వంటి అంశాల పాత్ర ఏమిటి? సంప్రదాయ వైద్యంలో ఉపయోగించే కొన్ని సహజ పదార్థాలను ఎలా పరిగణిస్తారు? అనే విషయాలను డాక్టర్ వివరిస్తున్నారు. ఈ వీడియోలో ప్రత్యేకంగా 5 రకాల పొడులు/చూర్ణాల గురించి ప్రస్తావించారు: త్రిఫల చూర్ణం, పసుపు, మెంతులు, పొడపత్రి (మధునాశిని), కాకరకాయ పొడి. ఈ పదార్థాలను సంప్రదాయ వైద్య విధానంలో ఎలా ఉపయోగిస్తారు? వాటి ప్రత్యేకత ఏమిటి? మధుమేహం ఉన్నవారు వీటి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటి? వంటి అంశాలను వీడియోలో వివరంగా తెలుసుకోవచ్చు. అలాగే, మధుమేహాన్ని కేవలం మందులతో మాత్రమే కాకుండా ఆహారం, జీవనశైలి, శారీరక చురుకుదనం, మానసిక ఒత్తిడి నియంత్రణ వంటి అంశాలతో కలిపి ఎలా నిర్వహించుకోవాలనే విషయాలపై కూడా వీడియోలో అవగాహన కల్పిస్తున్నారు. డయాబెటిస్ మందులు ఇప్పటికే వాడుతున్నవారు తమంతట తాముగా మందుల మోతాదును తగ్గించడం లేదా ఆపడం చేయకూడదు. ఈ వీడియోలో చెప్పే పొడులు లేదా ఇతర సహజ పదార్థాలను ఉపయోగించే ముందు మీ వైద్యుడి సలహా తీసుకోవడం మంచిది. త్రిఫల, పసుపు, మెంతులు, మధునాశిని, కాకరకాయ పొడుల గురించి డాక్టర్ ఏం చెబుతున్నారు? మధుమేహం నియంత్రణలో ఆహారం, జీవనశైలి, ఒత్తిడి నిర్వహణ ఎందుకు ముఖ్యమైనవి? తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. డయాబెటిస్ మందులను వైద్యుల సలహా లేకుండా ఆపడం లేదా మోతాదు మార్చడం చేయకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreదిండు లేకుండా నిద్రపోవడం వల్ల మెడ నొప్పి తగ్గుతుందా..దీని వెనుక ఉన్న అసలు నిజాలేంటి.!
రోజువారీ జీవితంలో గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేయడం లేదా కంప్యూటర్, మొబైల్ ఫోన్లు ఎక్కువగా వాడటం వల్ల మెడ పట్టుకుపోవడం, మెడ నొప్పి రావడం సాధారణంగా మారిపోయింది. ఈ నొప్పి తీవ్రమైతే కొందరిలో సర్వైకల్ పెయిన్ రూపంలో ఇబ్బంది పెడుతుంది. ఇలాంటి సమయంలో మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది సొంత వైద్యాలు లేదా చిట్కాలు పాటిస్తుంటారు. అందులో చాలామంది పాటించే ఉపాయం దిండు లేకుండా నిద్రపోవడం. దిండును పక్కన పెడితే మెడ నొప్పి పూర్తిగా తగ్గిపోతుందనే నమ్మకం చాలామందిలో ఉంది. అయితే ఇది నిజమేనా లేదా కేవలం ఒక అపోహ మాత్రమేనా అనే విషయాలను వివరంగా తెలుసుకుంటే.. దిండు లేకుండా నిద్రపోవడం వల్ల మెడ నొప్పి తగ్గిపోతుందా? మెడ నొప్పి తగ్గాలంటే వెంటనే దిండు వాడటం ఆపేయాలని చాలామంది భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం ఇందులో ఎలాంటి నిజం లేదు. మన వెన్నుపాము నిర్మాణం పూర్తిగా సూటిగా, నేరుగా ఉండదు. మెడ భాగంలో వెన్నుపాము స్వల్పంగా వంపు తిరిగి ఉంటుంది. నిద్రపోతున్న సమయంలో ఈ వంపుకు సరైన సపోర్ట్ లభించడం చాలా అవసరం. దిండు లేకుండా పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వెల్లకిలా పడుకున్నప్పుడు దిండు వాడకపోతే తల వెనుకకు వాలిపోతుంది. దీనివల్ల మెడ భాగంలోనూ, పరుపుకు మధ్య ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీ వల్ల మెడ కండరాలు, లిగమెంట్లపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. మెడ సహజమైన వంపు చదునుగా మారే ప్రమాదం ఉంది. ఫలితంగా ఉదయం లేచేసరికి మెడ నొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువవుతుంది. ఒక పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారికి భుజానికి, మెడకు మధ్య చాలా ఖాళీ ఉంటుంది. దిండు లేకపోతే తల పరుపు వైపు క్రిందికి వంగిపోతుంది. దీనివల్ల మెడ నరాలపై విపరీతమైన ఒత్తిడి పడి నరాలు లాగడం, తీవ్రమైన నొప్పి రావడం జరుగుతుంది. ఇది దీర్ఘకాలిక సర్వైకల్ సమస్యలకు దారితీస్తుంది. సరైన దిండును ఎలా ఎంచుకోవాలి? మెడ నొప్పి తగ్గడానికి దిండును పూర్తిగా మానేయడం పరిష్కారం కాదు, సరైన దిండును ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. దిండు మందం చాలా ముఖ్యం. అది మరీ ఎత్తుగా లేదా మరీ పలచగా ఉండకూడదు. నిద్రపోయేటప్పుడు నొసలు, గడ్డం ఒకే స్థాయిలో సమాంతరంగా ఉండేలా దిండు సహకరించాలి. దిండు బాగా ఎత్తుగా ఉంటే గడ్డం ఛాతీ వైపు ఒంగిపోతుంది. అలాగే దిండు బాగా పలచగా ఉంటే తల వెనుకకు వాలిపోతుంది. ఇవి రెండూ మెడకు హానికరమే. పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉన్నవారు తమ భుజం చివర నుండి మెడ వరకు ఉండే దూరానికి సరిపోయేంత మందం ఉన్న దిండును ఎంచుకోవడం మంచిది. నిద్రపోయే భంగిమతో పాటు సరైన సపోర్ట్ ఇచ్చే దిండును వాడటం ద్వారా మాత్రమే మెడ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. తీవ్రమైన మెడ నొప్పి లేదా నరాల ఒత్తిడి ఉన్నప్పుడు సొంత నిర్ణయాలు తీసుకోకుండా వైద్యులను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది. *రూపశ్రీ.
read moreఅందరూ తెలుసుకోండి.. మనకు క్యాన్సర్ వచ్చేలా చేసే వంటింట్లో వస్తువులు ఇవి.. !
ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. అయితే కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోయినా, ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయినా సరే కొందరికి ఈ వ్యాధి బారిన పడటం మనం చూస్తూనే ఉంటాం. దీనికి కారణం మనం రోజువారీ జీవితంలో, ముఖ్యంగా మన వంటింట్లో తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు , వంటల్లో వాడే కొన్ని పదార్ధాలే కారణమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన కిచెన్ లో ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలు, వాటిని వండే పద్ధతుల వల్ల క్యాన్సర్ కలిగించే కారకాలు (కార్సినోజెన్లు) తయారవుతాయట. వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం. మన వంటింట్లో క్యాన్సర్ ముప్పును పెంచే ప్రధాన అంశాలు , వాటి వివరాలు తెలుసుకుంటే.. అతిగా మాడ్చిన పదార్థాలు (ఆక్రిలమైడ్).. ఆహార పదార్థాలను అధిక ఉష్ణోగ్రత వద్ద అంటే దాదాపు 120 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు, లేదా మాడిపోయే వరకు వేయించినప్పుడు వాటిలో ఆక్రిలమైడ్ అనే రసాయన కాంపౌండ్ తయారవుతుంది. ఎక్కువగా వేయించిన బంగాళాదుంపలు, మాడిపోయిన దోసలు, పరోటాలు, డార్క్ బ్రౌన్ కలర్ లోకి మారిన బ్రెడ్ టోస్ట్, కొన్ని రకాల బిస్కెట్లలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్ళిన తర్వాత డిఎన్ఏ పై ప్రభావం చూపి జన్యు మార్పులకు కారణమవుతుంది. కాబట్టి వంటలను నల్లగా మాడకుండా దోరగా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోవడం మంచిది. క్యూబా వేయించిన మాంసాహారం (హెట్రోసైక్లిక్ అమైన్స్).. చికెన్, మటన్, చేపలు వంటి ప్రోటీన్ ఎక్కువ ఉన్న మాంసాహారాన్ని అధిక వేడి మీద ఎక్కువగా వేయించినప్పుడు లేదా గ్రిల్ చేసినప్పుడు ఈ కాంపౌండ్లు ఏర్పడతాయి. చికెన్ లేదా మటన్ ను నల్లగా మాడ్చి తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. నిప్పులపై నేరుగా కాల్చిన వంటకాలు (పాలోసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్).. బొగ్గులు లేదా నేరుగా గ్యాస్ మంటపై పెట్టి మాంసాన్ని లేదా ఇతర పదార్థాలను కాల్చినప్పుడు వాటిపై నల్లటి బొగ్గు లాంటి పొర ఏర్పడుతుంది. ఈ రసాయనాలు డిఎన్ఏ నిర్మాణాన్ని దెబ్బతీసి క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. మళ్లీ మళ్లీ వాడిన నూనె (రిపీటెడ్ కుకింగ్ ఆయిల్): ఒకసారి వాడిన నూనెను పదే పదే వేడి చేసి వాడటం మన ఇళ్లలో చాలా సాధారణం. కానీ నూనెను పదే పదే మరిగించడం వల్ల అందులో అనేక హానికరమైన ఆక్సిడైజ్డ్ కొవ్వులు, పాలిమర్స్, ఆల్డిహైడ్స్ ఉత్పన్నమవుతాయి. ఇవి శరీరంలోని జీన్స్ స్థాయిలోకి వెళ్లి క్యాన్సర్ కారకాలుగా మారతాయి. నిల్వ ఉంచిన ధాన్యాల్లో బూజు (అఫ్లాటాక్సిన్స్).. వేరుశెనగ పప్పులు, జొన్నలు, సజ్జలు, రైస్, గోధుమలు లేదా పప్పు ధాన్యాలను సరిగ్గా నిల్వ చేయనప్పుడు తేమ చేరి వాటిపై ఆస్పర్జిల్లస్ అనే ఫంగస్ (బూజు) ఏర్పడుతుంది. ఈ ఫంగస్ విడుదల చేసే అఫ్లాటాక్సిన్ అనే విష పదార్థం నేరుగా కాలేయం (లివర్) పై దాడి చేసి, లివర్ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి నిల్వ ఉంచే ధాన్యాలను తడి లేకుండా పొడిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రిజర్వ్ చేసిన ఆహారాలు , సాసె లు (నైట్రోజమైన్స్): ప్యాక్ చేసిన ఆహారాలు, డబ్బాల్లో నిల్వ ఉండే మాంసం, నగ్గెట్స్, వివిధ రకాల సాసెస్ లలో నిల్వ ఉండటానికి కొన్ని రకాల రసాయనాలు, వీటిలో నైట్రేట్స్ ప్రధానమైనవి. ఇవి కడుపులోకి వెళ్లాక నైట్రోజమైన్స్ గా మారి డిఎన్ఏను దెబ్బతీస్తాయి. అధికంగా రెడ్ మీట్ తీసుకోవడం: మటన్, బీఫ్, పోర్క్ వంటి రెడ్ మీట్ ను పరిమితికి మించి తరచూ తీసుకోవడం వల్ల కూడా పెద్దపేగు క్యాన్సర్ అయిన కోలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే అవకాశం పెరుగుతుంది. తాగునీటిలో ఆర్సెనిక్.. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో (బోర్ నీటిలో) ఆర్సెనిక్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. అలాంటి నీటితో పండించిన బియ్యం లేదా ఆ నీటితో వంట వండటం వల్ల దీర్ఘకాలంలో క్రోమోసోమల్ లోపాలు వచ్చి అనారోగ్యం పాలవుతారు. దీనికి పరిపరిష్కారంగా నీటిని పరిక్షించుకోవడం లేదా రైస్ వండేటప్పుడు ఎక్కువ నీరు పోసి ఉడికించిన తర్వాత గంజి వార్చడం వల్ల ఈ రసాయనాల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. రెడీమేడ్ ప్యాక్డ్ ఫుడ్స్ (ఫ్యూరాన్ కాంపౌండ్స్).. ప్యాక్ చేసిన సీల్డ్ ఫుడ్స్, అధిక వేడి వద్ద స్టెరిలైజ్ చేసిన ఇన్స్టంట్ బేబీ ఫుడ్స్, కప్ నూడుల్స్ వంటి పదార్థాల్లో ఫ్యూరాన్ కాంపౌండ్లు ఉంటాయి. చిన్నపిల్లలకు బయట దొరికే ప్యాక్డ్ సీరియల్స్ కంటే ఇంట్లో ఫ్రెష్ గా తయారుచేసిన ఆహారాన్ని ఇవ్వడమే ఆరోగ్యానికి మంచిది. వంటల్లో మద్యం ఉపయోగించడం (అసిటాల్డిహైడ్).. కొందరు బిర్యానీలు, కేకులు లేదా కొన్ని రకాల వంటకాల తయారీలో రుచి కోసం ఆల్కహాల్ వాడుతుంటారు. ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లాక అసిటాల్డిహైడ్ గా మారి క్యాన్సర్ కు దారితీసే అవకాశం ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఆహారాన్ని అధిక వేడి మీద నల్లగా మాడిపోయేలా వండకూడదు. వంటగదిలో మంచి గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. గదుల్లో బల్బ్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నూనెను పదే పదే వాడకుండా, నిల్వ పదార్థాలకు దూరంగా ఉంటూ, ఫ్రెష్ గా ఇంట్లో వండుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. *రూపశ్రీ.
read moreపిల్లల ఎదుగుదలకు ఈ 5 గింజల పొడి..రోజూ పాలలో కలిపి ఇవ్వండి!
పిల్లలు బరువు పెరగడం లేదా ఎత్తు పెరగడంలో ఇబ్బంది పడుతున్నారా? చదువులో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత విషయంలో సమస్యలు ఉన్నాయా? పిల్లల ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందించడంలో కొన్ని గింజలు ఉపయోగపడతాయి. డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ సూచించిన విధంగా బాదం, పిస్తా, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు తీసుకుని ఇంట్లోనే పోషకమైన గింజల పొడిని తయారు చేసుకోవచ్చు. ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకుని విడిగా వేయించి, మెత్తగా పొడి చేసుకుని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. ఈ పొడిలో అర టీస్పూన్‌ను 100 మి.లీ. గోరువెచ్చని పాలలో కలిపి పిల్లలకు ఇవ్వవచ్చని డాక్టర్ సూచిస్తున్నారు. ఈ గింజల్లో ఉండే పోషకాలు పిల్లల ఎదుగుదల, ఎముకల ఆరోగ్యం, మెదడు పనితీరు మరియు శారీరక బలానికి తోడ్పడవచ్చు. ఈ 5 గింజల పొడిని ఎలా తయారు చేసుకోవాలి? పిల్లలకు ఎంత మోతాదులో ఇవ్వాలి? పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreపచ్చ, నల్ల ఎండు ద్రాక్షలో ఏది బెస్ట్.. తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.!
ఎండు ద్రాక్షలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మార్కెట్‌లో మనకు రకరకాల ఎండు ద్రాక్షలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ముఖ్యంగా పచ్చగా లేదా బంగారు రంగులో ఉండే ఎండు ద్రాక్షలు, అలాగే నల్లటి ఎండు ద్రాక్షలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ రెండింటిలో ఏది తినాలి, దేని వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి అనే విషయంలో చాలామందికి సందేహాలు వస్తుంటాయి. నిజానికి రెండిట్లోనూ ఎన్నో రకాల పోషకాలు నిండి ఉన్నాయి. కానీ తయారు చేసే విధానం, వాడే ద్రాక్ష రకం ఆధారంగా వీటి రంగుతో పాటు వాటిలోని గుణాలు, అందించే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. పచ్చ లేదా బంగారు రంగు ఎండు ద్రాక్ష.. పచ్చటి లేదా బంగారు రంగు ఎండు ద్రాక్షలను సాధారణంగా ఆకుపచ్చ ద్రాక్ష పండ్ల నుంచి తయారు చేస్తారు. వీటిని త్వరగా ఎండబెట్టడానికి, వాటి రంగు మారకుండా ఉండటానికి ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగిస్తారు. వీటిలో విటమిన్ సి, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడంలో చాలా బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, మలబద్ధకం సమస్యను నివారించడానికి సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. తియ్యటి రుచితో ఉండే ఇవి పిల్లలకు, పెద్దలకు ఎంతో మంచి ఆహారం. నలుపు ఎండు ద్రాక్ష.. నల్లటి ఎండు ద్రాక్షలను నల్లటి ద్రాక్ష పండ్ల నుంచి సహజ సిద్ధంగా ఎండబెట్టడం ద్వారా తయారు చేస్తారు. సహజంగా ఎండడం వల్ల వీటి రంగు నల్లగా మారుతుంది. వీటికి నల్లటి రంగును ఇచ్చే ఆంథోసైనిన్ అనే ప్రత్యేక యాంటీ ఆక్సిడెంట్ వీటిలో సమృద్ధిగా ఉంటుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అలాగే రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి నల్ల ఎండు ద్రాక్షలు ఎంతగానో దోహదపడతాయి. వీటిలో ఉండే కాల్షియం, బోరాన్ వంటి ఖనిజాలు ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. జుట్టు రాలడం తగ్గడం, చర్మం పై ముడతలు త్వరగా రాకుండా చూడటం, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి ప్రత్యేక ప్రయోజనాలు నల్లటి ఎండు ద్రాక్షల ద్వారా లభిస్తాయి. ఈ రెండింటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది? రెంటికీ వాటి ప్రత్యేక స్థానం ఉంది. తక్షణ శక్తి కావాలన్నా, మంచి జీర్ణక్రియ, సులువైన ఐరన్ పోషణ కావాలంటే పచ్చటి ఎండు ద్రాక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ గుండె ఆరోగ్యం, అధిక రక్తపోటు నియంత్రణ, ఎముకల బలం, జుట్టు , చర్మ సంరక్షణ వంటి విషయాల్లో నల్లటి ఎండు ద్రాక్షలు కాస్త ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయి. నల్లటి ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు కాస్త ఎక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని వ్యాధుల బారిన పడకుండా కాపాడటంలో ఇవి ముందంజలో ఉంటాయి. కాబట్టి రెండింటిలో ఏదో ఒకదాన్నే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. శరీర అవసరాలను బట్టి రెండింటినీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఉదయాన్నే నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షలను తింటే వాటిలోని పోషకాలు శరీరానికి మరింత త్వరగా అందుతాయి. నానబెట్టిన నీటిని తాగడం వల్ల కూడా శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. పరిమితికి లోబడి ప్రతిరోజూ వీటిని తీసుకోవడం వల్ల పూర్తి ఆరోగ్యం సొంతమవుతుంది. *రూపశ్రీ.
read moreమెడలో గడ్డ అంటే క్యాన్సరేనా? డాక్టర్ చెప్పిన అసలు నిజం ఇదే!
మెడలో గడ్డ లేదా వాపు కనిపించగానే చాలామందికి క్యాన్సర్ గురించి భయం మొదలవుతుంది. కానీ మెడలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ కావాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ సమస్యలు, లింఫ్ నోడ్స్ వాపు, ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా మెడలో గడ్డలు ఏర్పడవచ్చు. మెడలో గడ్డలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్ వాపు ఎలా ఉంటుంది? లింఫ్ నోడ్స్ ఎందుకు పెరుగుతాయి? మెడలో గడ్డ కనిపిస్తే ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? సమస్యను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ ENT, హెడ్ & నెక్ సర్జన్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ మొగంటి ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. మెడలో గడ్డను నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాన్ని వైద్యుల సలహాతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మెడలో గడ్డలు, థైరాయిడ్ సమస్యలు, లింఫ్ నోడ్స్ వాపు మరియు అవసరమైన వైద్య పరీక్షల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. గమనిక: మెడలో గడ్డ లేదా వాపు ఉంటే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreవెలగపండు తింటే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..తప్పక తెలుసుకోండి!
వినాయక చవితి పూజలో వెలగపండు ఖచ్చితంగా ఉంటుంది. ఎంతో ప్రత్యేకంగా కనిపించే వెలగపండును కేవలం నైవేద్యానికే పరిమితం చేస్తుంటారు. చాలా ఇళ్లలో వెలగపండు నైవేధ్యంగా పెట్టాక వాటిని వినాయకుడితో పాటు నిమజ్జనం చేయడం లేదా పడేయడం లేదా వాటిని అలాగే వదిలేయడం చేస్తుంటారు. కానీ ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వెలగ పండుకు చాలా ప్రాధాన్యత ఉంది. పైకి గట్టి పెంకుతో సాధారణంగా కనిపించినప్పటికీ, లోపల ఉన్న గుజ్జు అమృతంతో సమానమైన పోషకాలను కలిగి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ పండు కలిగించే ప్రయోజనాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అవేంటో తెలుసుకుంటే.. జీర్ణవ్యవస్థ.. వెలగపండులో ఫైబర్ అధికంగా ఉంటుంది, అలాగే అందులో ఉండే టానిన్లు జీర్ణక్రియను వేగవంతం చేయడమే కాకుండా గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మలబద్ధకం లేదా విరేచనాలతో బాధపడేవారికి ఈ పండు సహజమైన ఔషధంగా తోడ్పడుతుంది. కడుపులో ఉన్న చెడు బ్యాక్టీరియాను నశింపజేసి ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తి విటమిన్ సీ, విటమిన్ ఏ , వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు వెలగపండులో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో చేరే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, కణాల నాశనాన్ని అడ్డుకుంటాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా వెలగపండు పాత్ర ప్రశంసనీయం. క్రమంతప్పకుండా పరిమితంగా తీసుకోవడం వల్ల రక్తంలోని మలినాలు తొలగిపోతాయి. కాలేయం, మూత్రపిండాల ఆరోగ్యం.. కాలేయం, మూత్రపిండాల రక్షణకు వెలగపండు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపడంలో కాలేయానికి సహాయపడి, దాని పనితీరును సమర్థవంతంగా ఉంచుతుంది. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడి మూత్రసంబంధిత సమస్యలు రాకుండా చూస్తుంది. డయాబెటిస్ .. డయాబెటిస్ లేదా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునేవారికి వెలగపండు మంచి ఆహారం. దీని గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధీకరించడంలో సాయపడుతుంది. శరీరం శక్తి కోల్పోకుండా, తక్షణ శక్తిని అందించడంలో దీనిలోని పోషకాలు తోడ్పడతాయి. మహిళల ఆరోగ్యానికి.. మహిళల ఆరోగ్యానికి కూడా వెలగపండు చాలా మేలు చేస్తుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో, అలాగే పాలిచ్చే తల్లులలో పాల ఉత్పత్తి పెరగడంలో వెలగపండు గుజ్జు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి ఇందులోని యాంటీఆక్సిడెంట్లు దోహదపడతాయి. వెలగపండును గుజ్జు రూపంలో నేరుగా లేదా కొద్దిగా బెల్లం లేదా తేనె కలిపి తీసుకోవచ్చు. వెలగపండు వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఏ ఆహారమైనా పరిమితికి మించి తీసుకుంటే సమస్యలు రావచ్చు. అతిగా తింటే కడుపునొప్పి లేదా జీర్ణసమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున, సరైన పరిమాణంలో తింటూ వెలగపండు నుంచి ఆరోగ్య లాభాలను పొందడం మంచిది. *రూపశ్రీ.
read moreదిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రపోతున్నారా ఇదెంత చెడ్డ అలవాటో తెలుసా.!
రాత్రి వేళల్లో నిద్రపోయే ముందు ఫోన్ చూడటం, ఆ తర్వాత దానిని దిండు కింద లేదా తలకు దగ్గర్లో పెట్టుకుని నిద్రపోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. పొద్దున్నే అలారం వినపడటం సులువవుతుందని కొందరు, అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తే వెంటనే ఎత్తవచ్చని మరికొందరు ఇలా చేస్తుంటారు. అయితే, ఈ అలవాటు మన ఆరోగ్యంపై, నిద్ర నాణ్యతపై ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతుందో తెలిస్తే ఖచ్చితంగా దిగ్భ్రాంతి చెందుతారు. ప్రశాంతమైన నిద్రను దూరం చేయడమే కాకుండా, శరీరానికి ప్రమాదకరమైన సమస్యలను కొనితెచ్చే ఈ అలవాటు గురించి ప్రతీ ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి. దిండు కింద ఫోన్ పెట్టుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల గురించి వివరంగా తెలుసుకుంటే.. మన శరీరంలో నిద్రను నియంత్రించడానికి మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. రాత్రి వేళ చీకటి పడినప్పుడు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్ నుండి వచ్చే నీలి రంగు వెలుతురు (బ్లూ లైట్) మెలాటోనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫోన్ దిండు కింద ఉన్నప్పుడు, తరచుగా వచ్చే నోటిఫికేషన్లు, రింగ్ టోన్లు లేదా లైట్లు మన గాఢ నిద్రకు భంగం కలిగిస్తాయి. దీనివల్ల పొద్దున్నే లేచినా అలసటగా అనిపించడం, రోజంతా నీరసంగా ఉండటం జరుగుతుంది. స్మార్ట్‌ఫోన్లు పనిచేస్తున్నప్పుడు , నెట్‌వర్క్ సిగ్నల్స్ కోసం వెతుకుతున్నప్పుడు రేడియేషన్ బయటకు వస్తుంది. ప్రతిరోజూ రాత్రి పూట ఎనిమిది గంటల పాటు ఫోన్‌ను తలకు అతి సమీపంలో ఉంచుకోవడం వల్ల ఈ రేడియేషన్ ప్రభావం నేరుగా మెదడుపై పడే అవకాశం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల తలనొప్పి, ఏకాగ్రత లోపించడం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఫోన్ ఛార్జింగ్ అవుతున్నప్పుడు లేదా బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైనా యాప్ నడుస్తున్నప్పుడు వేడి ఉత్పత్తి అవుతుంది. ఫోన్‌ను దిండు కింద పెట్టినప్పుడు ఆ వేడి బయటకు వెళ్ళడానికి దారి ఉండదు. దిండు, పరుపు వేడిని పట్టి ఉంచుతాయి. దీనివల్ల ఫోన్ తీవ్రంగా వేడెక్కి బ్యాటరీ పేలిపోవడం లేదా పరుపుకు నిప్పు అంటుకోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిద్రలేమి వల్ల కేవలం ఉదయం అలసట మాత్రమే కాకుండా దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, మధుమేహం, బరువు పెరగడం , గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల మరుసటి రోజు జ్ఞాపకశక్తి, పనిలో సామర్థ్యం తగ్గుతాయి. ఈ అలవాటు నుంచి బయటపడటానికి కొన్ని సులువైన మార్గాలు: నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను మంచానికి కనీసం ఐదు నుంచి ఆరు అడుగుల దూరంలో ఉంచడం మంచిది. అలారం కోసం ఫోన్ వాడేవారైతే, దానికి బదులుగా ఒక సాధారణ టేబుల్ క్లాక్ లేదా అలారం గడియారాన్ని ఉపయోగించడం అలవాటు చేసుకోండి. నిద్రపోవడానికి అరగంట ముందే ఫోన్‌ను పక్కన పెట్టేసి, వైఫై లేదా మొబైల్ డేటాను ఆపివేయడం మంచిది. ఈ చిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఇలా చేస్తే నిద్ర నాణ్యత పెరగడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఎవరిని వారు కాపాడుకోవచ్చు. *రూపశ్రీ.
read moreక్రియాటినిన్ పెరిగితే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నట్టేనా.. డయాలసిస్‌పై క్లారిటీ..!
క్రియాటినిన్ అంటే ఏమిటి? మన శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు ఎందుకు పెరుగుతాయి? క్రియాటినిన్ ఎక్కువగా ఉంటే కిడ్నీల పనితీరుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలకు దీనికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ వీడియోలో Creatinine Test, Creatinine Levels, Kidney Functionగురించి ప్రముఖ నెఫ్రాలజిస్ట్ Dr. Sree Bhushan Raju, MD, Nephrology వివరంగా తెలియజేస్తున్నారు. రక్తంలో క్రియాటినిన్ స్థాయిని ఎలా పరీక్షిస్తారు, రిపోర్టులో వచ్చే ఫలితాలను ఎలా అర్థం చేసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోవచ్చు. క్రియాటినిన్ స్థాయి పెరగడానికి కిడ్నీ సమస్యలతో పాటు డీహైడ్రేషన్, కండరాలకు సంబంధించిన సమస్యలు, అధిక శారీరక శ్రమ వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. అందుకే ఒకసారి క్రియాటినిన్ ఎక్కువగా వచ్చిందని మాత్రమే కిడ్నీ ఫెయిల్యూర్ అని భావించకూడదు. అవసరమైన ఇతర పరీక్షలతో పాటు వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కిడ్నీల ఆరోగ్యం, క్రియాటినిన్ స్థాయిలు, కిడ్నీ ఫిల్టరింగ్ సామర్థ్యం, గుండె ఆరోగ్యంతో ఉన్న సంబంధం గురించి ఈ వీడియోలో మరిన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreమెడలో గడ్డ అంటే క్యాన్సరేనా..డాక్టర్ చెప్పిన అసలు నిజం ఇదే.!
మెడలో గడ్డ లేదా వాపు కనిపించగానే చాలామందికి క్యాన్సర్ గురించి భయం మొదలవుతుంది. కానీ మెడలో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ కావాల్సిన అవసరం లేదు. థైరాయిడ్ సమస్యలు, లింఫ్ నోడ్స్ వాపు, ఇన్ఫెక్షన్లు తదితర కారణాల వల్ల కూడా మెడలో గడ్డలు ఏర్పడవచ్చు. మెడలో గడ్డలు ఎందుకు వస్తాయి? థైరాయిడ్ వాపు ఎలా ఉంటుంది? లింఫ్ నోడ్స్ ఎందుకు పెరుగుతాయి? మెడలో గడ్డ కనిపిస్తే ఎప్పుడు వైద్యులను సంప్రదించాలి? సమస్యను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు అవసరం? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ ENT, హెడ్ & నెక్ సర్జన్ డాక్టర్ అశోక్ పృథ్వీరాజ్ మొగంటి ఈ వీడియోలో సులభంగా వివరిస్తున్నారు. మెడలో గడ్డను నిర్లక్ష్యం చేయకుండా, దాని కారణాన్ని వైద్యుల సలహాతో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో మెడలో గడ్డలు, థైరాయిడ్ సమస్యలు, లింఫ్ నోడ్స్ వాపు మరియు అవసరమైన వైద్య పరీక్షల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి. గమనిక: మెడలో గడ్డ లేదా వాపు ఉంటే స్వయంగా నిర్ధారణ చేసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreఎర్ర గోంగూర ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు.. !
ఎర్ర గోంగూర.. కేవలం తెలుగు రాష్ట్రాల రుచుల్లోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిచుకుంది. ఆకుకూరల్లో గోంగూరకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరలో ఆరోగ్య గుణాలు, పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది దీని పులుపుదనం వల్ల లేదా పులుపు ఎక్కువైతే ఏమన్నా సమస్యలు వస్తాయేమోనని కాస్త దూరంగా ఉంటారు. కానీ, ఎర్ర గోంగూర రోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఎర్ర గోంగూరలో ఉండే పోషకాలు ఏమిటి? ఎర్ర గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకుంటే ఎర్ర గోంగూరను అస్సలు వదిలిపెట్టరు. ఎర్ర గోంగూర గురించి వివరంగా తెలుసుకుంటే.. ఎర్ర గోంగూర అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. రక్తహీనతకు చెక్ పెడుతుంది: నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఎర్ర గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎర్ర గోంగూర ఒక సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది: వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు సహజంగా వస్తుంటాయి. ఎర్ర గోంగూరలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను దృఢంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. చిన్నపిల్లల పెరుగుదలకు, ఎముకల ఎదగడానికి ఇది చాలా మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: ఎర్ర గోంగూరలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, పేగుల్లో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది: ఈ ఆకుకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినందిస్తుంది. కంటి చూపు పెరిగేందుకు దోహదం చేస్తుంది: ఎర్ర గోంగూరలో విటమిన్ ఏ తగినంత ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూ, దృష్టి లోపాలు రాకుండా కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి రక్షణ: ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నిరోధించడంలో ఎర్ర గోంగూర కీలకంగా పనిచేస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా చూడటానికి ఇది దోహదపడుతుంది. అలాగే తలకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి: ఎర్ర గోంగూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న ఎర్ర గోంగూరను దైనందిన ఆహారంలో పప్పు రూపంలోనో, పచ్చడి రూపంలోనో లేదా ఇతర కూరల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. *రూపశ్రీ.
read moreమన చుట్టూనే ఉండే ఈ ఆకు.. ఇన్ని సమస్యలకు ఉపయోగమా.!
మన చుట్టూ ఎక్కడ చూసినా కనిపించే కొన్ని మొక్కల్లో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి మొక్కల్లో కుప్పింటాకుకూడా ఒకటి. దీనినిపిప్పింటాకు, మురిపిండి, హరిత మంజరివంటి పేర్లతో కూడా పిలుస్తారు. శాస్త్రీయంగా దీనిని Acalypha indica అంటారు. కుప్పింటాకును మన సంప్రదాయ వైద్య విధానాల్లో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగాపిప్పి పన్ను నొప్పి, పంటి సమస్యలు, గజ్జి, దురద, తామర వంటి చర్మ సమస్యలకు సంప్రదాయంగా ఉపయోగించే విధానాల గురించి ఈ వీడియోలో డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ వివరిస్తున్నారు. కుప్పింటాకు మొక్కలోని ఆకులు, వేర్లు తదితర భాగాలను వివిధ సంప్రదాయ పద్ధతుల్లో ఉపయోగించినట్లు సమాచారం ఉంది. అయితే ఏ ఆరోగ్య సమస్యకైనా స్వయంగా చికిత్స చేసుకోవడం కాకుండా, సరైన వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం. కుప్పింటాకు మొక్కను ఎలా గుర్తించాలి? పిప్పి పన్ను నొప్పి, చర్మ సమస్యల వంటి వాటికి దీనిని సంప్రదాయంగా ఎలా ఉపయోగిస్తారు? ఈ ఆకు వల్ల చెప్పుకునే ఇతర ప్రయోజనాలు ఏమిటి? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read moreనీలి బృంగాది తైలం.. ఇది జుట్టుకు చేసే మేలు ఏంటంటే..!
నీలిబృంగాది తైలం పూర్వకాలం నుండి ఆయుర్వేదంలో జుట్టు సంరక్షణకు ఉపయోగించే ఒక అద్భుతమైన మూలికా నూనెగా పేరుగాంచింది. నేటి కాలంలో పెరిగిన కాలుష్యం, మానసిక ఒత్తిడి, జీవనశైలి సరిగా లేకపోవడం, రసాయన ఉత్పత్తుల వాడకం వల్ల అనేక రకాల జుట్టు సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలన్నింటికీ నీలిబృంగాది తైలం ఒక సహజసిద్ధమైన పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ నూనె గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నూనె తయారీలో వాడే పదార్థాలు.. ఈ నూనె తయారీలో నీలి, భృంగరాజ్ లేదా గుంటగలగర, ఆమ్లా లేదా ఉసిరి, శతక్రాంత, అజక్షీర అంటే మేక పాలు, మహిష క్షీర అంటే బర్రె పాలు, గోక్షీర అంటే ఆవు పాలు, మరియు కొబ్బరి పాలు లేదా నువ్వుల నూనె వంటి శక్తివంతమైన ఆయుర్వేద మూలికలు మరియు పాలను ఉపయోగిస్తారు. ఈ పదార్థాల కలయిక జుట్టుకు , కుదుళ్లకు కావలసిన సమగ్ర పోషణను అందిస్తుంది. ప్రయోజనాలు.. నీలిబృంగాది తైలం క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు రాలడం చాలా తగ్గుతుంది. ఇది కుదుళ్లను దృఢంగా మార్చి, కొత్త జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ నూనెలో ఉండే నీలి , భృంగరాజ్ మూలికలు జుట్టు సహజ రంగును కాపాడటంలో విశేషంగా తోడ్పడతాయి. చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారించడంలో , జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది. జుట్టు పెరగడమే కాకుండా, తలలో వచ్చే చుండ్రు , దురద సమస్యలను తగ్గించడంలో కూడా ఇది ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కాల్ప్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి. కుదుళ్లలో రక్తప్రసరణను మెరుగుపరచి, వెంట్రుకలు చిట్లడాన్ని , పొడిబారడాన్ని అడ్డుకుంటాయి. ఈ తైలం కేవలం జుట్టుకే కాకుండా మానసిక ప్రశాంతతకు కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే చలవ చేసే గుణం వల్ల రాత్రి పూట ఈ నూనెతో తలకు మర్దన చేసుకుంటే ఒత్తిడి తగ్గి, మంచి నిద్ర పడుతుంది. కంటి అలసటను తగ్గించి, శిరోభారాన్ని ఉపశమనం చేయడంలో ఇది సహాయపడుతుంది. ఎలా వాడాలి? ఈ నూనెను వాడే విధానం కూడా చాలా సులభం. కొద్దిగా తైలాన్ని తీసుకుని కుదుళ్లకు బాగా పట్టించి, మునివేళ్ళతో సున్నితంగా మర్దన చేయాలి. కనీసం అర గంట నుండి గంట సేపు ఉంచుకున్న తర్వాత మెత్తటి సీకాయ లేదా మైల్డ్ ఆయుర్వేద షాంపూతో తలస్నానం చేయాలి. వారానికి రెండు నుండి మూడు సార్లు ఈ నూనెను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. సహజమైన పద్ధతిలో జుట్టును ఆరోగ్యంగా, దృఢంగా , అందంగా మార్చుకోవడానికి నీలిబృంగాది తైలం చాలా మంచి ఎంపిక. *రూపశ్రీ.
read moreటైఫాయిడ్ వచ్చిందా చెన్నంగాకు తింటే జీర్ణక్రియ మెరుగవుతుందా డాక్టర్ సత్య సూచనలు
టైఫాయిడ్ వచ్చిన తర్వాత ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జీర్ణక్రియ సక్రమంగా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ విషయాల గురించి యునాని వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్.జి.వి. సత్య ఈ వీడియోలో వివరిస్తున్నారు. ముఖ్యంగా చెన్నంగాకు ( కసువింద, కసుంధి ఆకులు) గురించి, వీటిని చట్నీ, పొడి లేదా కూర రూపంలో తీసుకోవడం గురించి డాక్టర్ సత్య వివరించారు. టైఫాయిడ్ తర్వాత జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు, తీసుకోవాల్సిన ఆహారం, ఆరోగ్య జాగ్రత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. టైఫాయిడ్‌కు సంబంధించిన ఆహారపు అలవాట్లు, చెన్నంగాకు ఉపయోగాలు, జీర్ణక్రియకు సంబంధించిన డాక్టర్ సూచనలు తెలుసుకోవాలంటే పూర్తి వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. టైఫాయిడ్ వంటి అనారోగ్య పరిస్థితుల్లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి. మందులను వైద్యుల సూచన లేకుండా ఆపకండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
read more











.webp)
.webp)


.webp)


.webp)



