Headache - The most common Demon!

The occurence of headcahes is very common. WHO states that tension headaches are the second most disabling condition in the world, with migraine being third. When headache strike what hurts is not the brain because brain lack pain-sensitive nerves. but several areas over head including scalp, face, mouth and throat may hurt due to the presence of pain-sensitive nerve fibres. It might be shocking to know that there are different types of headaches! 1. Migraine - A migraine headache is throbbing pain, usually localised to one side of the head, which may be severe and last from few hours to days. It may be accompanied with nausea, vomiting, sensitivity to light and noise and visual disturbances. This runs in families, and women are most likely to be afffect when compared to men! 2. Cluster Headaches - These aren't common. They are one-sided stabbing pain that last for an hour or two. They may occur one or more times  a day for a few days or weeks to months, sometimes at the same time of day also, hence the term 'cluster'. They are more prevalent in men than women. 3. Tension Headache - The most common form of headache, which is caused bymuscle tension in head neck and shoulders. It is steady, non-throbbing mild to moderate pain on both sides of the head. It may be caused by stressfull situations, thus also called stress-headache. 4. Hormonal Headaches and Migraine - Few women experience headaches and migraines simultaneously at times when their hormae levels go haywire, usually during menustruation. we are yet to find out what is triggering these demons on women! 5. Exertion Headache - some poeple experience headaches post -physical strain, though these are harmless, but at times they might be due to the underlying bleed, tumours or arterial disorders. It is best advised to ee a doctor when you are striked by exertion headache. 6. Eye-strain Headache - Seen in poeple who do not address their visual problem wit prescribed glasses or contact lens. It causes pain and heaviness around the eye. Some eye conditions such glaucoma, astigmatism and presbyopia can also cause headache. 7. Secondary Headache - Secondary headaches are a common symptom secondary disorders, such as sinus infections, severe hypertension, inflammation of the temporal artery and hangover. Take Care!! Stay Healthy!!

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
పేపర్లో చుట్టిన ఆహారం తింటే కేన్సర్‌

కాలం మారిపోయి ఉండవచ్చు. మనం తినే ఆహారంలో చిన్నా చితకా మార్పులు వచ్చి ఉండవచ్చు. కానీ  మనదేశంలో ఇప్పటికీ ఆహారాన్ని అమ్మే తీరులో పెద్దగా మార్పు రాలేదు. రోడ్డు పక్కన దొరికే సమోసాల దగ్గర్నుంచీ, బండి మీద అమ్మే బజ్జీల వరకూ సాధారణంగా న్యూస్‌పేపర్లోనే చుట్టి ఇస్తారు. న్యూస్‌పేపర్ చవకగా దొరుకుతుంది కదా, దాంతో పొట్లం తేలికగా కదా అని అమ్మేవాడు అనుకోవచ్చు... కానీ ఆ అలవాటుతో కేన్సర్ సైతం దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.   అసలు న్యూస్‌పేపర్లలో చుట్టిన పదార్థాలు ఎంతవరకు క్షేమం అన్న అనుమానం వచ్చింది మన దేశ ఆరోగ్యశాఖ మంత్రి జే.పి.నడ్డాకి. దాంతో ఈ అలవాటు మీద తగిన మార్గదర్శకాలను జారీచేయవలసిందిగా The Food Safety and Standards Authority of India (FSSAI) కి సూచించారు. దాంతో FSSAI వెలువరించిన ఓ ప్రకటన ఇప్పుడు దుమారాన్ని రేపుతోంది.   FSSAI ప్రకారం న్యూస్‌పేపర్‌ ముద్రణలో వాడే నానారకాల రంగులు, రసాయనాల వల్ల ఆరోగ్యానికి తీవ్రహాని జరగవచ్చు. పైగా వీటిలో ఉండే Bioactive materials వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు, పాత న్యూస్‌పేపర్ల మీద రకరకాల సూక్ష్మక్రిములు వృద్ధి చెందే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది FSSAI.   రీసైక్లింగ్ చేసిన కాగితాలతో రూపొందిన అట్టపెట్టెల వల్ల కూడా ఆరోగ్య సమస్యలు తప్పంటున్నారు. వీటిలో లోహ అవశేషాలు, phthalates వంటి హానికారక రసాయనాలు ఉంటాయట. అవి జీర్ణసంబంధ వ్యాధులకి దారితీస్తాయనీ, శరీరాన్ని విషమయం చేసేస్తాయనీ హెచ్చరిస్తున్నారు.   అదీ విషయం! కాబట్టి న్యూస్‌పేపర్లలో కానీ, రీసైక్లింగ్ చేసిన వస్తువులలో కానీ ఆహారపదార్థాలను చుట్టవద్దన్నది FSSAI సూచన. కనీసం ఆహార పదార్థాలలో ఉండే నూనెను పీల్చేసేందుకు కూడా వీటిని వాడవద్దంటున్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, రోగులు ఇలాంటి అలవాటుకి దూరంగా ఉండాలని కోరుతున్నారు. వీరిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి, కేన్సర్ వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు.   న్యూస్‌పేపర్లో ఆహారాన్ని అందించడాన్ని నివారించేందుకు చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అవకాశం ఏదీ లేదు. కాకపోతే ప్రజల్లోనూ, అమ్మకందారుల్లోనూ తగిన అవగాహన కల్పించేందుకు దేశమంతటా ప్రచారం చేసే దిశగా FSSAI చర్యలు తీసుకుంటోంది. అది ఎంతవరకు ఫలితాలనిస్తుందో వేచిచూడాల్సిందే! ఈలోగా మనవరకు మనం అలాంటి ఆహారానికి కాస్త దూరంగా ఉంటే మంచిది.   - నిర్జర.

read more
Keep away the Infections!

    Well, as we all know ‘Prevention is better than Cure!’ These infections, to which we fall prey, are successful in their attempt for the sole reason that we neglect the petite things or the minor precautions slip out of our minds! In general, the basic principle for infection prevention and control is the hygiene. Hygiene includes personal, social, community and food hygiene! Personal hygiene includes, the basic cleanliness, promptly washing your hand before eating and trimming and keeping nails clean aid maximum in avoiding food borne diseases. Immunization is yet another precaution to be taken. Food borne disease poses a major challenge in the prevention of the infections. The food may be contaminated by either microbes due to over-exposure to the environment or by chemicals the chemical seep into our foods as preservatives. So it’s best to eat self-cooked and fresh foods! Over these, there are epidemic scares too which spread through pork and chicken. So extra-care has to be taken while cooking them! If you are a pet-keeper, then you have to tighten up your rules of hygiene, as infections may spread through their feces. Keep your pet under the specialized care of a Vet; get its regular shots and treatments for worms. And stay away from the stray and wild animals!  One must keep in mind that not always we need an anti-biotic dosage when you are sick. These pills only work against the bacteria but not against viruses. If you take anti-biotic improperly or take them unnecessarily you might develop drug resistant bacteria and anti-biotic drugs can not fight these resistant bacteria. Thus, never ever share anti-biotic drugs neither change the dosage if not advised by a physician!     .....SIRI  

read more
పోషకాలు ఉండాలంటే ఈ పాత్రలోనే వండాలి

మనం తీసుకునే ఆహారం గురించి శ్రద్ద తీసుకుంటున్నాం. కానీ, ఏ పాత్రలో వండితే ఆహారపదార్థాల్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయో అన్న విషయం మాత్రం ఆలోచించడం లేదు. వంట త్వరగా కావాలన్న ఆలోచనతో ప్రెషర్ కుక్కర్లను, ఎలక్రికల్ రైస్ కుక్కర్లను, ఇండక్షన్, ఓవెన్ లను ఉపయోగిస్తున్నాం. వీటిలో తయారుచేసే ఆహారపదార్థాల్లో పోషకాలు ఉంటాయా మన శరీరానికి కావల్సిన మోతాదులో అందుతాయా అంటే లేదనే చెప్పాలి. ఏ ఆహారమైనా వండేటప్పుడు గాలి, వెలుతురు తగలాలి అని మన పెద్దలు చెప్పారు. సూర్య రశ్మి, గాలి తగలని పదార్థాలు పాయిజగా మారుతాయి. అయితే ఈ పాయిజన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి తక్షణమే పని చేస్తుంది. దానినే ఫుడ్ పాయిజన్ అంటాము. రెండవ రకమైన పాయిజన్ మెల్లగా ప్రభావం చూపిస్తుంది. అది కొన్ని నెలలు కావచ్చు.. సంవత్సరాలు కావచ్చు. ప్రతి రోజు ప్రతి ఇంట్లో వాడే ప్రెషర్ కుక్కర్ ను గమనిస్తే  ఇందులో ఆహారం వండేటప్పుడు ఏ మాత్రము గాలి, సూర్య రశ్మి తగిలే అవకాశమే లేదు. ప్రెషర్ తో అతి త్వరగా ఇందులోని పదార్థాలు ఉడుకుతాయి. ఎక్కువగా అల్యూమినియంతో తయారుచేసిన కుక్కర్లను ఉపయోగిస్తున్నారు. ఇది మరింత ప్రమాదం అంటున్నారు శాస్త్రవేత్తలు. జ్ఞాపకశక్తిని తగ్గించి క్రమంగా మనిషిని నిర్వీర్యం చేసే గుణం అల్యూమినియంలో ఉంది. ప్రెషర్ కుక్కర్ తయారుచేసిన లోహం, ఇందులో వండే విధానం రెండు ఆహారపదార్థాల్లోని పోషకాలను హరించి దీర్ఘకాలంలో శరీరానికి హాని చేస్తాయి. ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారం తీసుకునేవారిలో ఎక్కువగా అసిడిటీ సమస్యలు కనిపిస్తాయి.  మధుమేహం, కీళ్ళవాతం మొదలైన సమస్యలు కూడా వస్తాయి. రిఫ్రిజిరేటర్, మైక్రో వేవ్ ఓవెన్ వంటి గాలి,వెలుతురు ప్రవేశించని చోట ఉంచిన ఆహారపదార్థాలు ఏవైనా ప్రమాదకరమే. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్(CTRI) వారి నివేదిక కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మట్టి కుండే బెటర్ ఆధునిక వంటగదిలో అందుబాటులోకి వచ్చిన పాత్రల కన్నా మట్టి కుండే బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కారణం ఇందులో వండే ఆహారపదార్థల్లో పోషకవిలువలు నూటికి నూరు శాతం ఉంటాయట. మట్టి పాత్రల తర్వాతి స్థానం కంచు పాత్రలది. ఇందులో వండే పదార్థాల్లో పోషకాలు 97శాతం ఉంటాయట. ఇత్తడి పాత్రలో 93 శాతం పోషకాలు అందుతాయట. మరి అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ లో వండితే మాత్రం పది నుంచి 15శాతం మాత్రమే పోషకాలు ఉంటాయట.

read more
ఐసోలేషన్ అవసరమైన వారు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు

టెస్ట్... ట్రేస్... ట్రీట్ మెంట్ ఈ మూడు పద్దతుల ద్వారానే కోవిద్ 19 వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు అన్నది పూర్తిగా స్పష్టమైంది. దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ వైద్య పరీక్షల సంఖ్య పెరుగుతుంది. అదే స్థాయిలో పాజిటివ్ వ్యక్తుల సంఖ్య కూడా పెరుగుతోంది. కొద్ది పాటి లక్షణాలతో ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేని వారు ఐసోలేషన్ లో ఉండాలని వైద్యలు సూచిస్తున్నారు. మరి ఐసోలేషన్ అవసరమైన వారు పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలపై అవగాహన పెంచుకోవడం మంచిది. ఇంట్లోనే ఐసోలేషన్ ద్వారా కోవిద్ 19 వైరస్ నుంచి రక్షణ పొందవచ్చు.  ఐసోలేషన్ అవసరమైన వారు పాటించాల్సిన నియమాలు.. - విటమిన్ సి -1000, విటమిన్ ఇ (ఇ) సప్లిమెంట్స్ తీసుకోవాలి. - సూర్యరశ్మిలో 15-20 నిమిషాలు ఉండాలి. బయటకు వెళ్లినా.. ఇంట్లో మిగతా కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు తప్పనిసరిగా ముఖానికి మాస్క్ పెట్టు కోవాలి. - పోషకాలతో కూడిన భోజనం వేడిగా తినాలి.  రోజూ ఒక కోడి గుడ్డు తప్పనిసరిగా తినాలి. - కనీసం 7-8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. - వీటన్నింటితో పాటు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. - ఊపిరితిత్తులు పనితీరు పెంచే ప్రాణాయామం చేయాలి.  ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఈ కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి కోవిద్ 19వైరస్ ను ఎదుర్కోనే శక్తిని ఇస్తుంది.

read more
చిన్నగింజల్లో పెద్ద ప్రయోజనాలు

యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసే దినుసుల్లో కొన్ని వంటింట్లో ఉండే పొపుల డబ్బాను ఔషధాల పెట్టెగా చెప్పవచ్చు. మన పూర్వీకులు ఎంతో అనుభవంతో కొన్ని రకాల గింజలను మన ఆహారంలో భాగంగా చేర్చారు. వాటిలో కొన్నింటి గురించి ... - నల్లమిరియాలు వీటినే క్వీన్ ఆఫ్ స్పెషల్ గా పిలుస్తారు. నల్లమిరియాల కి ఆయుర్వేదంలో చాలా విశిష్ట స్థానం ఉంది. వీటిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో దోహదం చేస్తాయి పాలల్లో చిటికెడు మిరియాలపొడి వేసుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫం అంతా పోతుందని ఆయుర్వేద వైద్యులు చెప్తారు. వెల్లుల్లి మిరియాలు కాంబినేషన్ శరీరానికి కొత్త శక్తిని ఇస్తాయి. మిరియాల టీ, అల్లం మిరియాల టీ రోజూ తీసుకుంటే అనేక రకాల సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఉంటుంది. - జీలకర్ర జీలకర్ర బెల్లం లేకుండా హిందూ సంప్రదాయంలో పెండ్లి జరగదు.  జీలకర్ర ఆవాలు పోపు లేనిదే చాలామందికి పప్పు అన్నం గొంతు దిగదు. శరీరంలోని ఉష్ణాన్ని తీసేసే శక్తి జీలకర్రకు ఉంది.దీనిలోని పాలీఫినాల్స్ అనే పదార్థం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది - నట్స్ శరీరానికి ఇమ్యూన్ బూస్టర్ గా నట్స్  పనిచేస్తాయి యాంటీఆక్సిడెంట్ గాను, రోగనిరోధక శక్తి పెంచడంలోనూ గింజలు కీలక పాత్ర పోషిస్తాయి.జీడిపప్పు, పిస్తా, వేరుశెనగ గింజలు రోజూ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు తో పాటు ఇతర పోషకాలు లభిస్తాయి. - బాదం పప్పు ఇంలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. బాదం, గసగసాలు రెండు కలిపి పొడిగా చేసి పాలలో కలుపుకుని తాగితే శరీరానికి కావల్సిన క్యాల్షియం అందుతుంది. - అవిసె గింజలు గింజల్లో కెల్ల చాలా ప్రత్యేకమైన స్థానం. ఇందులో ఉన్న ఆల్ఫా లినోలెనిక్ ఆమ్లం,  ఒమేగా-3 కొవ్వు కరిగించడంలో చాలా సమర్థవంతంగా పని చేస్తాయి. దీనిని ఫైటో ఈస్ట్రోజెన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన గ్రహించే శక్తి ని ఇవి ఇస్తాయి. ఇవి రోజూ తీసుకుంటే... శరీరంలోని అధిక కొవ్వును కరిగించడంతో, రోగనిరోధక శక్తి పెంచడంలో లవంగాలు, దాల్చినచెక్క, అల్లం, వెల్లుల్లి బాగా పనిచేస్తాయి. - లవంగాలు ఇందులో ఉండే ఫైబర్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ కె శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మెదడు పని తీరును చురుగ్గా చేస్తాయి. అంతేకాదు ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతాయి.  వీటిలో సమృద్ధిగా ఉండే విటమిన్ సి,  విటమిన్ కె రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, కఫం, పంటినొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు లవంగాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. - దాల్చిన చెక్క శరీరంలోని కొవ్వును కరిగించడంలో దాల్చిన చెక్క ది కీలక పాత్ర. ఇందులో ఉండే పాలిఫినాల్స్ అనబడే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.-  అంతేకాదు శరీరంలోని రక్త కణాలు ఆక్సిజన్ను గ్రహించే శక్తిని కూడా పెంచుతాయి. -అల్లం రోజూ అల్లం తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా నివారిస్తోంది. రోజూ పరగడుపున అల్లం తేనెతో కలిపి తీసుకోవడం ఎంతో ఉత్తమం. అల్లం తినడం వల్ల శరీరంలో అధికంగా ఉండే కొవ్వు కరిగిపోతుంది. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు ఇది మంచి ఔషధం. -వెల్లుల్లి అల్లము వెల్లుల్లి చాలా మంచి కాంబినేషన్. ఈ రెండింటి మిశ్రమం లేనిదే నాన్ వెజ్ కర్రీలకు రుచి రాదు. యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉన్న వెల్లుల్లి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు దరిచేరవు. గుండె జబ్బులను వెల్లుల్లి నివారిస్తుంది.

read more
సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ ఇచ్చే సీజనల్ ఆహారం

గుమ్మడి, బొప్పాయ రోగనిరోధకశక్తి పెంచుతాయి ఎనర్జీ బూస్టర్ గా పనిచేసే సిట్రస్ జాతి పండ్లు కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత తరుణంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఈ సమస్యను నివారించే ఉత్తమ మార్గం. మరి మనలో రోగనిరోధక శక్తి పెరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న విషయంపై అవగాహన పెంచుకోవాలి.  ప్రతిరోజూ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎన్నో పోషక విలువలతో పాటు అనారోగ్య సమస్యలను నివారించే గుణాలు కూడా ఉన్నాయి. కొన్ని రకాల పండ్లను మనం ప్రతి రోజూ ఆహారంలో తీసుకోవడం ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు శరీర భాగాల పని తీరు సక్రమంగా సాగుతుంది. సీజనల్ వచ్చే అనేక వ్యాధుల నుంచి,  కరోనా లాంటి భయంకర రోగాల నుంచి మనకు రక్షణ లభిస్తుంది. నిత్యం మార్కెట్లో లభించే రకరకాల ఆహార పదార్ధాలు మనలో రోగనిరోధకశక్తిని పెంచేందుకు దోహదపడతాయి వాటిలో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం...  గుమ్మడి కాయ గుమ్మడి కాయలో రెండు రకాలు బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ. తీపి గుమ్మడి కాయలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో రోగ నిరోధక వ్యవస్థను మెరుగు పరిచే అనేక సూక్ష్మ పోషకాలు లభిస్తాయి. గుమ్మడికాయ ఆహారంగా తీసుకోవడం ద్వారా శరీరంలోని వివిధ భాగాలు సక్రమంగా పనిచేస్తాయి. బొప్పాయి బొప్పాయి గురించి మనందరికీ తెలుసు. ఇందులో ఉండే పాపినేని ఎంజాయ్ రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. బొప్పాయి రోజూ తినేవారిలో  విటమిన్ లోపాలు ఉండవు . అంతేకాదు డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు బొప్పాయి ఆకుల రసం, బొప్పాయి పండు ఇస్తాయి. వీటితో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో తెల్లరక్తకణాల సంఖ్యను పెంచుతాయి. - కివి ఇటీవల మనకు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. వీటిలో పొటాషియం, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరంలోని రోగ నిరోధక శక్తి పెంచడానికి దోహదం చేస్తాయి. - నిమ్మకాయ సహజంగానే సిట్రస్ జాతి పండ్లను బూస్టింగ్ ఫుడ్స్ అని అనొచ్చు. ఇక నిమ్మకాయ గురించి మనందరికీ తెలుసు. వైరస్ బ్యాక్టీరియా వల్ల వచ్చే జబ్బుల నుంచి కాపాడటానికి అవసరమైన విటమిన్ సి ఇందులో పుష్కలంగా లభిస్తుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. రోజూ ఒక గ్లాసు నిమ్మరసం తాగితే వైరస్, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు వలన వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. - నారింజ జ్వరం వచ్చిన వాళ్ళు, నీరసంగా ఉన్న వాళ్ళు  ఆరెంజ్ రసం తాగితే  తక్షణం శక్తి వస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఈ పండు తీసుకోవడం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.  - ఉసిరి ఔషధాల సిరి గా ఉసిరిని చెప్పవచ్చు. ఇందులో రెండు రకాలు పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి. ఈ రెండు రకాల ఉసిరి లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా విటమిన్ సి తో పాటు ఇతర పోషకాలు శరీరానికి అందుతాయి. యాంటీ బ్యాక్టీరియల్ గా పనిచేసే ఉసిరిలో అధిక రక్తస్రావాన్ని నివారించేలో లక్షణాలు ఉన్నాయి. దీన్ని కూరగాయలు లోనే కాకుండా ఔషధాలలో ఎక్కువగా వాడతారు. - అరటిపండు అరటిపండు, అప్రికాట్ వంటి పండ్లలో ఎక్కువ మోతాదులో పొటాషియం ఉంటుంది. మన శరీరానికి కావలసిన పొటాషియం లభిస్తుంది. వీటిని రోజూ తీసుకోవడం వలన బి.పి తగ్గుతుంది. అంతేకాదు అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వాళ్లకి పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు మెండుగా ఉన్నాయి. - పుచ్చకాయ ఆకుపచ్చ ఎరుపు రంగులతో ఆకట్టుకునే పుచ్చకాయ సీజనల్ లోనే లభించేది. కానీ ఇప్పుడు ఏ సీజన్లోనైనా మనకు మార్కెట్లో కనిపిస్తుంది. పుచ్చకాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.  నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. - అల్ల నేరేడు సీజనల్ గా  వచ్చే ఈ పళ్ళు యాంటీఆక్సిడెంట్లు కు కేరాఫ్ అని చెప్పవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి మెరుగవడానికి ఈ పండ్లు ఎంతో దోహదం చేస్తాయి.  చక్కెర వ్యాధితో బాధపడే వాళ్ళు నేరేడు పళ్ళ గింజలను ఎండబెట్టి పొడి చేసి ఒక చెంచా పొడిని నీటిలో వేసుకుని తాగితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

read more
శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం..

శరీరానికి శక్తిని ఇచ్చే ఆహారం.. రోజువారి ఆహారంలో ఇవి ఉన్నాయా.. ప్రతి రోజూ మన ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన పదార్థాలు కొన్ని ఉంటాయి. వాటిలో ముఖ్యంగా క్యారెట్, బచ్చలి, తులసి, పాలకూర, నిమ్మకాయ, కోడిగుడ్లు మొదలైనవి. - ప్రతి ఇంట్లో తులసి తప్పనిసరిగా ఉండాలని మన పెద్దలు అంటారు పూజించడానికి కాదు ఆరోగ్యానికి తులసి ఆకులు ఎంతో మంచివి. రోజూ నాలుగు తులసి ఆకులు నమలడం వలన శరీరంలోని సూక్ష్మక్రిములు చనిపోతాయి ఎన్నో వ్యాధి కారకాలను తులసి నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ రోజు ఉదయాన్నే తులసి టీ తాగడం వల్ల కూడా శరీరానికి కావలసిన శక్తి వస్తుంది. - మీరు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే రోజు ఉదయాన్నే మీ రోజుని గ్రీన్ టీతో ప్రారంభించండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్  మీలో రోగ నిరోధక శక్తి పెంచడానికి ఎంతో సహాయపడుతుంది గ్రీన్ టీ తాగడం వలన శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కరగడం కాకుండా శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది.  - మీరు తీసుకునే ఆహారంలో ఆకుకూరలు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. వీటిలో ముఖ్యంగా బచ్చలి, పాలకూర. రోజూ ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడం వలన శరీరానికి కావలసిన పోషకాలూ అందుతాయి. ఆకుకూరల్లో బచ్చలి కూరది విశిష్ట స్థానం. ఇందులో విటమిన్ సి తోపాటు బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది. - పాలకూర విటమిన్ సి ,బి 6 తో పాటు విటమిన్ కె ఇందులో అధికంగా ఉంటుంది క్యారెట్ ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్ జ్యూస్ తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇందులో ఉండే బీటా కెరోటిన్ విటమిన్ బి 6 యాంటీఆక్సిడెంట్లు ఉత్తేజపరుస్తాయి క్యారెట్ టమాటతో కలిపి తాగితే క్యాన్సర్ ను నివారించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. - ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవడం పెరుగులో అనేక పోషక విలువలు ఉన్నాయి. జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేసే పెరుగును రాత్రి సమయాల్లో కాకుండా పగటి పూట అన్నంలో తీసుకోవడం మంచిది. వ్యాధినిరోధక శక్తిని పెంచే పెరుగు తీసుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు పటిష్టమవుతాయి. క్యాల్షియం ఎక్కువగా ఉండే ఈ పెరుగు రక్తపోటును నియంత్రిస్తుంది. -  ప్రతిరోజూ గుడ్డు తీసుకోవడం మరిచిపోవద్దు.గుడ్డు లోని ప్రోటీన్, విటమిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి రోజూ ఒక కోడి గుడ్డు తినడం ద్వారా శరీరానికి కావలసిన ప్రొటీన్లు, పోషకాలు అందుతాయి. - శరీరం కోల్పోయిన యాంటీ ఆక్సిడెంట్లు తిరిగి ఏర్పడ్డానికి జింక్ బాగా తోడ్పడుతుంది శరీరానికి కావాల్సిన జింక్ ఎక్కువగా కోడిగుడ్డు మాంసంతో పాటు సీఫుడ్ లో లభిస్తుంది వారానికి రెండుసార్లు తీసుకోవడం వలన శరీరానికి అవసరమైన జింక్ విటమిన్-డి లభిస్తాయి వీటివలన శరీరం యొక్క రోగనిరోధక శక్తి తిరిగి ఏర్పడుతుంది. - ఎర్ర బియ్యం లోనూ అధిక యాంటీఆక్సిడెంట్స్ కంటెంట్ ఉంది రోగనిరోధకశక్తిని పెంచడానికి పళ్ళు కూరగాయలు మసాలా దినుసులతో పాటు ఎర్ర బియ్యం కూడా ఎంతో ఉపయోగపడతాయి.‌ వీటన్నింటితో పాటు ప్రతిరోజు మంచినీళ్లు ఎక్కువగా తాగడం ఎంతో అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.

read more
స్పైసెస్ రుచికోసమేనా.. ORAC అంటే..?

మనం నిత్యం తీసుకునే ఆహారంలో సుగంధద్రవ్యాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహామ్మారి విజృంభిస్తున్న నేపథ్యంతో మరోసారి మన సుగంధద్రవ్యాలలోని ఔషధ విలువల గురించి చర్చ జరుగుతుంది. తక్కువ మోతాదులో వాడే వీటి వల్ల మనం తీసుకునే ఆహారానికి కమ్మని రుచి వస్తుంది. వీటిని రుచికోసమే వాడతామా అంటే కాదనే చెప్పాలి. అంతకుమించిన  వీటిలో ఉన్నది ఎంటో తెలుసుకుందాం.. శరీరంలో రక్తకణాలు ఆక్సిజన్ ను గ్రహిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలన్నా.. వ్యాధులకు ఎదుర్కోవాలన్నా ఆక్సిజన్ తగినంతగా శరీరకణాలను అందాలి. అప్పుడే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనం తీసుకునే సుగంధ ద్రవ్యాలకు రక్తకణాలు ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించేలా చేయగలిగే శక్తి ఉంది. దీన్నే ఓఆర్ఎసి( ఆక్సిజెన్ రాడికల్ అబ్సోర్బెన్స్ కెపాసిటీ) అని పిలుస్తారు. మనం రోజూ వాడే పసుపు, తులసి, అల్లం మొదలైన వాటిలో పదిరెట్లు ఓఆర్ఎసి ఉంటుంది. అంతేకాదు ప్రకృతి సిద్దంగా లభించే పండ్లు, కూరగాయలు, గింజలు, మూలికలు ఆక్సిజెన్ గ్రహించే శక్తిని పెంచుతాయి. కొన్ని సుగంధ ద్రవ్యాలలోని ORAC .... లవంగం: 314,446 ORAC దాల్చినచెక్క: 267,537 ORAC పసుపు: 102,700 ORAC జీలకర్ర: 76,800 ORAC తులసి: 67,553 ORAC అల్లం: 28,811 ORAC జాజికాయ : 69,640 ORAC నల్ల మిరియాలు : 34, 053 ORAC కోవిడ్ 19 వైరస్  నుంచి రక్షణ పొందాలంటే మన శరీరంలోని రోగనిరోధక శక్తినిపెంచుకోవడమే ఏకైకమార్గం. ఓఆర్ఎసి ఎక్కువగా ఉంటే ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరా రక్షణ యంత్రాంగానికి కావల్సిన సూక్ష్మపోషకాలైన ఐరన్, జింక్, మెగ్నిషియం, విటమిన్ సి, విటమిన్ డి, ఒమేగా3 వంటి వాటిని శరీరం గ్రహించగలుగుతుంది. మన ఆయుర్వేదంలోనూ వీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆధునిక యుగంలోనూ మందులు లేని ఎన్నో వ్యాధులను ఇవి నయం చేస్తున్నాయి. ప్రపంచాన్ని వణికించిన ఎన్నో వ్యాధులను అరికట్టడంతోనూ మన భారతీయ ఆయుర్వేద వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మన సాంప్రదాయ ఆహారంలోనే ఔషధ విలువలు ఉన్నాయి. వాటిని మనం గ్రహించాలి. భవిష్యత్ లో వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే కంప్యూటర్ లో ఇంటెల్ ప్రాసెసర్  పనిచేసినట్టే మన శరీరంలోనూ రోగనిరోధక శక్తి పనిచేయాల్సిందే.

read more
కరోనా తగ్గించే కషాయాలు...

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మాస్క్ లు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం కొన్ని రకాల కషాయాలను ఇంట్లో చేసుకుని రోజూ రెండు పూటలు తాగడం ఆరోగ్యకరం. తులసి ఆకులు, దాల్చిన చెక్క, శొంఠి, నల్ల మిరియాలను నీళ్లలో వేసి బాగా మరగబెట్టి బెల్లం లేదా తేనెతో.. హెర్బల్‌ టీ మాదిరిగా తాగితే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.   ధనియాలు, మిరియాలు, దాల్చినచెక్క, శొంఠి సమపాళ్ళలో తీసుకుని పొడి చేయాలి. ఒక స్పూన్ పొడిని గ్లాస్ నీటిలో వేసి ఐదు నిమిషాలు మరిగించాలి. తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, యాలకులు, శొంఠి, ఎండుద్రాక్ష, బెల్లం, నిమ్మరసం తీసుకోవాలి. వీటిలో దాల్చిన చెక్క, నల్లమిరియాలు, యాలకులు, శొంఠి పొడి చేసుకోవాలి. ఒక లీటర్ నీటిని వేడి చేస్తూ అందులో ఎండు ద్రాక్ష, ముందుగా చేసుకున్న పొడి, తులసి ఆకులు వేయాలి. పది నిమిషాల పాటు మరిగిన తర్వాత చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం, బెల్లం కలిపి తాగాలి. ఒక లీటర్ నీటితో చేసుకునే ఈ కషాయం ఇంట్లో నలుగురికి సరిపోతుంది. అల్లం, పసుపు, మిరియాలు, బెల్లం. రెండు గ్లాసుల వేడి నీటిలో స్పూన్ అల్లం రసం, అర స్పూన్ పసుపు, పావు స్పూన్ మిరియాల పొడి వేయాలి. ఐదు నిమిషాలు మరిగిన తర్వాత బెల్లం వేయాలి. వేడివేడిగా ఈ కషాయం తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

read more
Ginger! Ginger!

Ginger belongs to the same family of Turmeric which is ‘Zingiberaceae`. Probably that has something to do with the medicinal properties of ginger. Ginger is said to have originated in china. But Indians are the ones who have used it in huge proportions for culinary as well as the medicinal purpose. Even today India is the leading producer of ginger. The contents such as Gingerol are responsible for its pungent smell as well as the herbal properties. The day to day ailments like cough and cold are always treated with the extracts of ginger in our society. Some of the other well known and well proved medicinal qualities of ginger are as follows. For Digestion:     Ginger is known for thousands of years for its positive effect on our digestion. The taste of ginger itself would provoke the digestive juices. Having a ginger tea after meals would certainly aid the digestive process. It’s antibacterial and anti fungal properties would keep the intestines safe from the foreign bodies. However people with stomach ailments like ulcers are not advised to take huge quantities of raw ginger without the advice of a professional. Against Tumors:     Even The American Cancer Society has agreed that the extract from ginger has either slowed down or prevented the growth of cancerous tumors in the animals. In another study it was found that the cancer cells died when they came into contact with the ginger solution. Ginger was found to be helpful against ovarian, breast and colon cancers. In Nausea:     The feeling of sickness associated with vomiting sensation is called nausea. It might occur during pregnancy, while travelling on bus, while being on ship, while undergoing chemotherapy… The smell of ginger itself can relieve much of nausea. Ginger when taken during such situation is found to act as good as a medicine available in the drugstore. Even the Naval cadets were found to be relived from sea sickness after consuming ginger. Anti inflammatory:   The ingredient of Gingerol mentioned before is found to be anti-inflammatory as well as analgesic (that reduces pain). That is the reason why ginger is advised frequently for the patients suffering from rheumatoid arthritis and Osteoarthritis. In a few studies, when the patients suffering from the above ailments were regularly given the supplements extracted from ginger… the mobility of their joints seems to have improved and the pain associated with stress on joints seems to have been relived. Ginger is found to work as analgesic in migraines and menstrual pain as well. Diabetic and cardiovascular diseases:     No health article can be complete without mentioning these two ailments that are associated with our day to day lifestyle and are major causes for our health troubles. Ginger was proved to encourage the intake of insulin into muscles thereby decreasing the levels of glucose in bloodstream. Regular intake of ginger was also associated with the decrease of triglycerides and LDL cholesterol levels which are major culprits for diabetics as well heart diseases. Besides minerals like Magnesium, Manganese, Phosphorus, Potassium and Zinc would ensure a free flow of blood towards the heart. As the herbal values associated with ginger seems to be elevating day by day, the saying in future might be as follows - `A pinch of ginger a day keeps the doctor away`     --Nirjara

read more
నొప్పిమాత్రలతో గుండెపోటు

నొప్పి రానివాడు, వచ్చాక అది త్వరగా తగ్గిపోతే బాగుండు అనుకోనివాడు ఈ ప్రపంచంలో ఉండడు. కానీ బజారులో దొరుకుతున్నాయి కదా అని ఎడాపెడా నొప్పిమందులను వాడేస్తే అవి మన గుండెకే చేటు అని చెబుతున్నారు ఇటలీకి చెందిన కొందరు పరిశోధకులు.  తరచూ తీసుకునేవే నొప్పి నివారణ కోసం రోగులు సాధారణంగా రెండురకాల మందులను వాడతారు. ఒకటి- అనాదిగా వాడుతున్న Non-selective non-steroidal anti-inflammatory drugs (NSAID). ఇబూప్రొఫెన్‌, డైక్లోఫెనాక్‌ వంటి మందులు ఈ కోవలోకి వస్తాయి. రెండు- COX-2 inhibitors. సెలకోక్సిబ్‌, రెఫెకోబ్సిబ్‌ వంటి మందులు ఈ విభాగంలోకి వస్తాయి. వినడానికి ఈ మందుల పేర్లనీ మనకి అయోమయంగా ఉండవచ్చు. కానీ బ్రూఫిన్, వోవరాన్‌ వంటి వందలాది బ్రాండ్ల పేరుతో అవి మనకు సుపరిచితమే! ఇంకా మన నోటి మీదే నిత్యం ఆదే ‘కాంబిఫ్లామ్‌’ వంటి కాంబినేషన్‌ మందులలో కూడా వీటి ఉనికి ఉంటుంది. లక్షలమంది మీద పరిశోధన మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేసే ఈ నొప్పి మందులు మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకొనేందుకు, ఐరోపాలోని కోటిమందిని పరిశీలించారు పరిశోధకులు. 2000 నుంచి 2010 సంవత్సారాల వరకూ ఈ నొప్పి నివారణ మాత్రలను వాడుతూ వస్తున్న రోగులను ఇందుకోసం ఎంచుకొన్నారు. కీళ్లనొప్పులు వంటి ఇబ్బందులను ఎదుర్కొనేందుకు వీరంతా కూడా నొప్పి మాత్రలను వాడుతూ వస్తున్నారు. వాపులతో కూడిన నొప్పులని నివారించేందుకు వైద్యులు ఈ మందలును తప్పకుండా సూచిస్తూ ఉంటారు.  గుండెజబ్బులు నొప్పి నివారణ మాత్రలను వాడుతున్నవారిలో 92,163  మంది గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడాన్ని గమనించారు పరిశోధకులు. వీరిలో 19 శాతం మంది ఓ రెండువారాలు నొప్పి మాత్రలను వాడగానే, ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఎంత వృద్ధులైనప్పటికీ మరీ 19 శాతం మంది మాత్రలను వాడిన కొద్దిరోజులకే ఆసుపత్రిలో చేరడం అనేది ఆలోచించాల్సిన విషయమే! పైగా వాడుతున్న మాత్రనిబట్టి 16 శాతం నుంచి 83 శాతం వరకూ గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటోందని తేలింది. సాధారణంగా పెద్దవారిలో కీళ్లనొప్పులు సాధారణం కాబట్టి, వీటి కోసం వాడే మందులు వారి ఆయుష్షునే దెబ్బతీయడం బాధాకరం. తగిన జాగ్రత్తలు చాలావరకు నొప్పినివారణ మాత్రలు మార్కెట్లో ఎడాపెడా దొరికేస్తూ ఉంటాయి కాబట్టి, ఇవి సురక్షితమే అన్న అపోహలో ఉంటారు ప్రజలు. కానీ దుష్ఫలితాలు లేని మందులంటూ ఉండవన్న విషయాన్ని వారు గుర్తెరగాలి. రక్తపోటు, గుండెజబ్బులు వంటి అవకాశాలు ఉన్నవారు ఈ మందులను వాడేటప్పుడు మరింత జాగ్రత్తగా మెలగాలి. ఎప్పుడన్నా మరీ భరించలేని నొప్పి ఉన్నప్పుడు, అది కూడా తగిన మోతాదులోనే... నొప్పి మాత్రలను వేసుకోవాలి. అన్నింటికీ మించి ఇటు వైద్యులూ, అటు ఆరోగ్య సంస్థలూ ఇలాంటి దుష్ఫలితాలు గురించి మరింత అవగాహన కల్పించాలి.   - నిర్జర.

read more