''ఆరోగ్యంగా వుండాలంటే రోజుకో పచ్చి వెల్లులిని తినండి'' అంటున్నారు నిపుణులు. వంటల్లో వెల్లులిని వాడినా వండినప్పుడు 'అల్లిసిన్' ఇతర శక్తివంతమైన కాంపౌండ్లుగా మారటం తగ్గిపోతుందట. కాబట్టి తాజా వెల్లులిని తినటం వల్ల మాత్రమే ఉపయోగం వుంటుందని అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని రసాయనాలు వండినప్పుడు కూడా దెబ్బతినకుండా వుంటాయి. కాబట్టి వంటల్లో విరివిగా వెల్లులిని వాడచ్చు అని కూడా చెబుతున్నారు.

పచ్చి వెల్లుల్లి రేకులని రోజుకు ఓ మూడు నోట్లో వేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ (LDL) ను 10 శాతం వరకు తగ్గించుకోవచ్చు. దాంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఇక అధిక రక్తపోటుకి వెల్లుల్లి మంచి ఔషదం. ఇది మాత్రలతో సమాన ప్రభావం కలిగి వుండటం గుర్తించారు పరిశోధకులు. ఇక వైరస్ లకు వెల్లుల్లి చెక్ చెబుతుందనటంలో అనుమానమే లేదు.

వెల్లుల్లి నమిలి తిన్నప్పుడు అందులోని 'అల్లిన్' అనే రసాయనం 'అల్లిసిన్' గా మారుతుంది. ఆ తర్వాత అది వెంటనే అజోన్ వంటి ఇతర రసాయన కాంపౌండ్ల రూపంలోకి మారుతుంది, వాటి వల్లే మనకు ఆరోగ్యకర ప్రయోజనాలు దక్కుతాయి.

                                                                                                                                ---రమ