మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. ఇది రక్తంలో ఉన్న చాలా రసాయనాల పరిమాణాన్ని నియంత్రించడంలోనూ, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. కడుపు, ప్రేగుల నుండి వచ్చే రక్తం మొత్తం కాలేయం గుండా వెళుతుంది. కాలేయం కూడా పిత్తాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది ఆహారం జీర్ణక్రియకు చాలా ముఖ్యమైనది. అందుకే ఈ అవయవం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. కాలేయ వ్యాధులకు సంబంధించిన వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

జీవనశైలి, ఆహారం తీసుకోవడంలో ఇబ్బందులు కాలేయానికి  చాలా నష్టం కలిగిస్తాయి. గత ఒకటి లేదా రెండు దశాబ్దాలలో, కాలేయానికి సంబంధించిన  వ్యాధుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆశ్చర్యకరంగా యువత కూడా ఈ సమస్యకు  బాధితులుగా మారుతున్నారు.

సర్వే లెక్కల ప్రకారం కాలేయానికి సంబంధించిన వ్యాధుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 1.3 మిలియన్లకు పైగా ప్రజలు మరణిస్తున్నారు. కాలేయానికి వచ్చే కొన్ని తీవ్రమైన వ్యాధులు ఏంటో తెలుసుకుంటే..

ఫ్యాటీ లివర్ డిసీజ్

ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే సాధారణ సమస్య. ఇందులో  చాలా మందికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి, ఈ సమస్య ఆల్కహాల్ తీసుకోని వ్యక్తులకు కూడా వస్తుంది.  జీవనశైలి మార్పులతో దీన్ని నయం చేసుకోవచ్చు. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు ప్రధాన కారణం. ఊబకాయం, మధుమేహం, రక్తపోటు. వీటిని నియంత్రించగలిగితే కాలేయ సమస్యలుంల్ రావు.

లివర్ ఇన్ఫెక్షన్ సమస్య

లివర్ ఇన్ఫెక్షన్ సమస్య కూడా చాలా సాధారణం. హెపటైటిస్ వైరస్ లివర్ ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. హెపటైటిస్‌ ఎ , హెపటైటిస్‌ బి, హెపటైటిస్‌ సి వంటి ఇన్‌ఫెక్షన్లు కాలేయానికి తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి. ఇది కాకుండా, కలుషిత ఆహారం లేదా నీటి వల్ల కాలేయం ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.  ఇన్ఫెక్షన్ ను నిర్లక్ష్యం చేస్తే కాలేయం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

కామెర్లు - కాలేయ వ్యాధి

కామెర్లు, హైపర్‌బిలిరుబినెమియా అని కూడా పిలుస్తారు, వాస్తవానికి ఇది కాలేయ వ్యాధి. అదనపు బిలిరుబిన్ చేరడం వల్ల ఏర్పడే పరిస్థితి, ఇది చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడానికి కారణమవుతుంది. బిలిరుబిన్ సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండటం కాలేయం లేదా పిత్త వాహిక సమస్యలకు సిగ్నల్ గా పరిగణించబడుతుంది. ఈ కమేర్ల వ్యాధి కేసులు సర్వసాధారణంగా కనిపిస్తాయి. అయితే నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికి ప్రమాదం కూడా..

                                   ◆నిశ్శబ్ద.