ఏ కాలం వచ్చిన పెద్దగా కలవరపడం కానీ వేసవికాలం వచ్చిందంటే ఉలికులికి పడతాం. రహదారులన్నీ నిప్పుల కుంపట్లుగా మండిపోతాయి, ఇళ్లన్నీ వెచ్చని ఆవిర్లతో కుతకుతలాడతాయి. వీటి మధ్య మనుషుల ప్రాణం వాడిపోయిన మొక్కలా ఊగిసలాడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రకృతి చాలా విచిత్రమైనది. కాలానికి తగ్గట్టు కమ్మని రుచులు వెంటబెట్టుకొస్తుంది. వేసవిలో విరివిగా లభించే వాటిలో తాటి ముంజలకు ఓ రేంజ్ ఉంది.. ఐస్ యాపిల్ అని పిలుచుకునే ఈ తాటి ముంజలు తెల్లగా, లేతగా లోపల కాసిన్ని నీళ్లు కలిగి తినడానికి ఎంతో మృదువుగా ఉంటాయి. ఇక వీటి రుచి వర్ణించడం మాటలకందనిది. కేవలం ఇలా రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని అందించడంలో కూడా తాటి ముంజలు ది బెస్టు..  వేసవిలో మాత్రమే లభించే వీటిని స్కిప్ చేయకుండా ఎందుకు తినాలి?? వీటి వల్ల కలిగే లాభాలేంటి?? తెలుసుకుంటే…

తాటి ముంజల్లో ఉండే పోషకాలేంటంటే..

తాటి ముంజల్లో విటమిన్ బి7, విటమిన్ కె, సోలెబుర్ ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్-ఎ, విటమిన్-డి, విటమిన్-సి, జింక్, ఐరన్ లతో పాటు  న్యూట్రిన్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

తాటి ముంజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

డీహైడ్రేషన్ కు దూరంగా ఉండొచ్చు..

వేసవికాలం అంటేనే శరీరాన్ని వణికించే కాలం. చాలా తొందరగా శరీరంలో తేమ ఆవిరైపోతుంది. శరీరం హైడ్రేట్ గా ఉండటానికి నీరు ఒక్కటే సరిపోదు. ఎన్నో రకాల జ్యూస్లు, పండ్లు తినాల్సి వస్తుంది. ఇవేమీ లేకున్నా తాటి ముంజలు తింటే చాలు, ఎంత ఎండకు అయినా అసలు అలసిపోరు. తాటి ముంజల్లో శరీరానికి కావాల్సినంత మినరల్స్, షుగర్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతాయి. వడదెబ్బ కారణంగా వచ్చే వాంతులు, వికారాలను దూరం ఉంచుతాయి.

చలువకు కేరాఫ్ అడ్రస్..

సీజన్లో మాత్రమే లభించే తాటి ముంజలు బెస్ట్ కూలింగ్ ఏజెంట్. శరీరానికి చల్లదనాన్ని అందించడంలో అద్భుతంగా సహాయపడతాయి. వేసవి వల్ల ఒంట్లో పెరిగే వేడిని అమాంతం తగ్గించడంలో తాటి ముంజలు ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. ముఖం మీద శరీరంలో అక్కడక్కడా వచ్చే వేడి కురుపులు, మొటిమలు తగ్గించడంలో సహాయపడతాయి.

క్యాన్సర్ కు కళ్లెం వేస్తుంది..

తాటి ముంజల్లో ట్యూమర్స్‌ను తగ్గించే లక్షణాలు ఉంటాయి. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను డవలప్ చేసే ఫైటోకెమికల్స్ ఆంథోసాయనిన్ లను నిర్మూలిస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే.. క్యాన్సర్ కు దూరం ఉండొచ్చు.

 అధిక బరువుకు చెక్ పెడుతుంది..

తాటి ముంజల్లో విటమిన్లు, మినరల్స్, ఐరన్, జింక్, పాస్పరస్, పొటాషియం, వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువ, కేలరీలు తక్కువగా ఉండటం వల్ల అధిక బరువుకు చెక్ పెట్టచ్చు.

రక్తపోటును దూరంగా ఉండచ్చు..

తాటి ముంజల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవచ్చు. పొటాషియం శరీరంలో ఉండే వ్యర్థాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. కిడ్నీ, లివర్ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. మలబద్దకంతో ఇబ్బంది పడేవారు తాటి ముంజలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో వచ్చే వేడి వల్ల మోషన్ ప్రొబ్లేమ్స్ వస్తు ఉంటాయి. వాటిని తాటి ముంజలు తీసుకోవడం వల్ల పరిష్కరించవచ్చు,  కడుపు ఉబ్బరం, కడుపులో వికారం, కడుపు నొప్పి, జీర్ణాశయ సమస్యలు కూడా దూరంగా ఉంటాయి. 

గర్భవతులకు మంచిది..

గర్భవతులకు కలిగే కండరాల తిమ్మిర్లు, అలసట తగ్గించడంలో తాటి ముంజలు బాగా సహాయపడతాయి..  గర్భిణీ స్త్రీలలో కలిగే వికారం, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రసవం తరువాత బాలింతలకు పాలు సమృద్ధిగా పడతాయి.

◆నిశ్శబ్ద.