అమ్మ, మహిళ గా అటు పురాణ ఇతహసాలాలో స్త్రీకి సమ్మున్నత స్థానం ఉందనే చెప్పాలి.భారతీయ సంస్కృతిలో స్త్రీకి సమున్నత స్థానం కల్పించారు. అయితే ప్రస్తుత పరిస్థితిలో అవమానం జరుగుతూనే ఉంది.స్త్రీని ఒక ఆట వస్తువుగా అంగడి బొమ్మగా భోగలాలస వస్తువుగా భావించడం లేదా ఎవరికీ తోచిన విధంగా వాడడం దురదృష్టకరం.స్త్రీల పట్ల ఈ రకమైన వైఖరి ని పూర్తిగా ఖండించాల్సిన విషయం. గర్హించాల్క్సిన విషయం. మేమే దేశ భక్తులం దేశభక్తికి మేమే పేటెంట్ హక్కుదరులమంటూ చెప్పే నేతలు ఉన్న ఈ సమాజం లో స్త్రీల పట్ల ఆయా ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్దతులు, తీసుకుంటున్న చర్యలు విశృంఖల చేష్టలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా వ్యవహరించడం గార్హనీయం. అన్నిటికీ మించి పురాణాలలో చెప్పిన విధంగా మీరు ఆచరిస్తున్నారో లేదో దేశభక్తులు చెప్పాలి.
ఈ సందర్భంగా మీకు ఒక శ్లోకాన్ని గుర్తుచేద్దామని నా ప్రయత్నం యస్య నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః
అవును దీని ఆర్ధం బహుశ దేశ భక్తులకు తెలుసో తెలియదో..
ఎక్కడ స్త్రీలు గౌరవింప బడతారో అక్కడ దేవతలు నడయాడుతారు అన్నది దాని ఆర్ధం నిలువేత్తువిగ్రహాలు కాదు స్త్రీని గౌరవించ లేని వారు రక్షణ కల్పించలేని మనం ఉన్న ఈ ప్రపంచానికి దేవతలు ఎలా వస్తారో దేశభక్తులు చెప్పాలి. అసలు దేశం లో స్త్రీ కి రక్షణ కల్పించే విషయం లో ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్దతులు లేదా చేస్తున్న చట్టాలు వాటి అమలు కు సిగ్గుపడాలి. ఇక్కడ కొన్ని అం శాలు చెప్పాలి.
పురాణాల లో స్త్రీ...
పురాణాలలో సైతం స్త్రీపాత్ర స్లాఘానీయం. అమ్మ అన్న పదానికి ఆర్ధం స్త్రీ స్త్రీని ఎప్పుడూ అమ్మతో సమానం గా చాలా పవిత్ర మైన రూపంగా భావిస్తారు.మాత అంటే జననీ అంటే అమ్మే ఈశ్వరునికి కన్నా ఎక్కువ ఆమె, ఈశ్వరునికి జన్మ నిచ్చింది స్త్రీ పురాణం లో అందుకు ఆధారం కృష్ణుడికి జన్మనిచ్చింది దేవకీ,కార్తికేయుడికి జన్మనిచ్చింది పార్వతి. శత్రు వినాశనానికి రాక్షస సంహారానికి పూనుకున్నది ఆది శక్తి అమ్మ వారే.నరకా సుర సంహారానికి సంహక రించింది స్త్రీ ఆమె సత్యభామ.
చరిత్రలో స్త్రీ...
వేల సంవత్సరాల బ్రిటీష్ పాలనను ఎదుర్కోడానికి నడుము భిగించింది భారాతీయ స్త్రీ. ఉద్యమాన్ని ముందుండి నడిపిన మహా శక్తి స్త్రీ ప్రతి ఉద్యమానికి ముందున్నది స్త్రీ ఇలా పురాణం లో చరిత్రలో స్త్రీ పాత్ర అజరా మారం శ్లాఘనీయం.పాలనలో స్త్రీ,అలనలో స్త్రీ, సైన్యం లో స్త్రీ,క్రీడలలో స్త్రీ,పోలీసులో స్త్రీ,సైన్యం లో స్త్రీ, ఇలా స్త్రీ లేని ప్రాంతం ఇది అనిచేప్పగాలమా? ఆకాశం లో సగం అంటారు రాజ్య పాలన లోనూ స్త్రీ కీలకంగా మారింది.
ఆధునిక సమాజం లో స్త్రీ ప్రాధాన్యత తగ్గిందా ?...
స్త్రీ గతం గొప్పది కాని వార్తమానం అంటే ఆధునిక సమాజం లో స్త్రీ ప్రాధాన్యత తగ్గింది. ఇది చింతించాల్సిన విషయం డబ్బు, పై వ్యామోహం, స్వార్ధం,లో మునిగి పోయారు. జన్మ నిచ్చిన స్త్రీ ని గౌరవించడం అన్నది చూస్తే వాస్తవానికి తగ్గిపోయింది. మారుతున్న కాలానికి అనుగుణంగా సంతానం ఉత్పత్తి విషయం లో అమ్మయొక్క ప్రాధాన్యత తగ్గింది. ఇది చింతించాల్సిన విషయం. జన్మనిచ్చిన తల్లి రూపం లోనే ఉన్న స్త్రీని గౌర వించడం అనివార్యం.ఇప్పుడు ఈ ప్రశ్న ఒక యక్ష ప్రశ్నగా మారిపోయింది.అమ్మ యొక్క ప్రాధాన్యత అంశం పై నేటి యువతులకు అవగాహన కల్పించాలి.
అదునిక యువతులలో పోటీ పెరిగింది...
నేడు మనం ఉన్నది 21 వ శతాబ్దం లో వివిధ అంశాల పైన దృష్టి పెట్టినప్పుడు కొన్ని రాగాలలో ముందడుగు వేస్తున్న మాట వాస్తవం అన్ని రంగాలాలో పూర్తిగా ముందడుగు వేస్తున్నారు. ఆడపిల్లలలో పోటీ పెరిగింది గత కొంత కాలం వరకూ స్త్రీని తక్కువగా బలహీనం గా చూసినట్లు తెలుస్తోంది.కాని వారి కష్టం,శ్రమ మేధా శక్తి తో ప్రతిరంగం లో ప్రావీణ్యం సాధిస్తున్నారు. అప్రతిభకు మనం పట్టం కట్టాల్సిందే. ఆడాళ్ళూ మీకు జోహార్లు.
తల్లే ఆది గురువు...
పిల్లవాడికి తల్లే ఆది గురువు అన్నది వాస్తవం. అది చరిత్ర చెప్పిన పాటం. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి పెరిగే దాకా అమ్మనే అనుసరిస్తాడు దెబ్బ తగిలినా మొదట పిలిచేది అమ్మనే. అమ్మ నేర్పిన తొలి పలుకు, అమ్మ వేయించిన తొలిఅడుగు, అన్నిటి లోనూ అమ్మ స్మృతి లో పెరిగే ఆబిడ్డ అమ్మచేప్పే పాట్టం గొప్పది చరిత్రలో చత్ర పతి శివాజీని తీర్చి దిద్దిన జిజాబాయి తొలి గురువుగా మారారు.కాబట్టే దేశ భక్తుడిగా పోరాడే యోధునిగా చరిత్రలో నిలిచిపోయాడు .ఆ అనితర సాధ్యమైన స్త్రీశక్తిని హేళన చేయడం, అవమానించడం నేడు ఒక ఫ్యాషన్ గా మారింది. ఇప్పుడైనా ఒక్కరోజు ఉమెన్స్ డే కాదు స్త్రీలు తమ కాళ్ళ పై నిలబడే అంతవరకూ చేయూత నివ్వడం ఆడపిల్లకు రక్షణ కల్పించడం వారి ఆరోగ్యాన్ని కాపాడడం మన కర్తవ్యంగా భావించాలి.కోవిడ్ సమయంలో లేడీ డాక్టర్స్ గా వారి సేవలు అజరామరం. అప్పుడు రోగులు కుప్పలు తెప్పలుగా పిట్టలా రాలి పోతున్నారు కోవిడ్ అంటు కుంటున్నాయని అంటున్నారు. కొంతమంది ఫ్య్జీశియన్లు సైతం చికిత్స చేసేందుకు భయపడుతున్న రోజులవి. కాని వృత్తిపరంగా ఒక రోగి ప్రాణం కాపాడడం ముఖ్యం అనుకున్నారు ఫీజీశియన్స్ గా రోగికి సేవచేయడమే కర్తవ్యం గా భావించారు.
Also Read: ఆసేవలు మరువలేం..వెలకట్టలేం....
ఒక పక్క కోవిడ్ రోగుల బాధలు చూస్తూ తమ కుటుంబానికి కోవిడ్ వస్తుందేమో అన్న భయం వస్తే ఎలా చికిత్స చేయాలి అని ఒక బాధ మరోపక్క అత్తమామలు, పిల్లలు భర్త బాధ్యత ఈ రెండిటి నడుమా నలిగి పోయినా మహిళా ఫిజీ షియన్ల కధలు వర్ణ ణా తీతం. అందరినీ మెప్పిస్తూ రోగులని కాపాడుతూ. కళ్ళ ముందు చని పోతున్న వారిపట్ల కన్నీరు కారుస్తూ కోవిడ్ సమయం లో పోరాడి,కోవిడ్ తో పోరాడిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా అశావర్కర్స్, నర్సులు.
అందరికీ తెలుగు వన్ హెల్త్ వారు చేసిన సేవలకు చేస్తోంది సెల్యూట్.మహిళా మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.