పండ్లలో చాలా రకాలు ఉన్నాయి. అయితే తెలుగు ప్రజలకు కాస్త పరిచయం తక్కువ ఉన్న పండ్లలో పాషన్ ఫ్రూట్ కూడా ఒకటి. ఈ పాషన్ ఫ్రూట్ లోపల గుజ్జు, గింజలతో కూడి ఉంటుంది. దీని తొక్క మాత్రం గట్టిగా చూడటానికి ఏ మారేడు కాయో అనిపించేలా ఉంటుంది. ఊదా రంగులోనూ, పసుపు రంగులోనూ పాషన్ ఫ్రూట్ లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. దీని గుజ్జుతో వివిధ రకాల పానీయాలు తయారుచేస్తారు.
రోగనిరోధక శక్తికి పాషన్ ప్రూట్ పెట్టింది పేరు. ఈ పండులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరోగ్యకరమైన చర్మానికి సహాకరిస్తుంది. పాషన్ ఫ్రూట్ లో పెద్ద మొత్తంలో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.
ఆరోగ్య ప్రయోజనాలు..
దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది..
విటమిన్ సి, పాలీఫెనాల్స్‌తో సహా పాషన్ ఫ్రూట్‌లోని అధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.
తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్..
పాషన్ ఫ్రూట్ లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచవు, మధుమేహం ఉన్నవారికి మంచివి. పాషన్ ఫ్రూట్‌లో ఆస్కార్బిక్ యాసిడ్ ఉంటుంది. రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో ఆస్కార్బిక్ ఆమ్లం సహాయపడుతుంది.
బరువు నిర్వహణ..
ఈ పండులో ఉండే పీచు పదార్ధం ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. తద్వారా పదే పదే తినడాన్ని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ప్రేగు కదలికలను చురుగ్గా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది..
విటమిన్ సి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, ఇన్ఫెక్షన్‌తో పోరాడడంలో, రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ప్యాషన్ ఫ్రూట్ పీల్స్ వల్ల రోగనిరోధక వ్యవస్థ ప్రభావవంతంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం..
ప్యాషన్ ఫ్రూట్‌లోని పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
గట్ మైక్రోబయోమ్..
ఒక చిన్న పాషన్ ఫ్రూట్ లో ఉండే ఫైబర్ ప్రీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇది మైక్రోబయోమ్‌ను మంచి బ్యాక్టీరియాతో ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
*నిశ్శబ్ద.